Featured

SriReddy: ‘ఏంటి నానీ.. నువ్వు కూడా స్క్రిప్ట్ చదువుతున్నావా’..! శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

SriReddy: టాలీవుడ్, ఏపీ ప్రభుత్వానికి మధ్య టికెట్ల లొల్లి నడుస్తోంది. కొంత మంది సినీ ఇండస్ట్రీకి మద్దతు పలుకుతుండగా…మరి కొంత మంది జగన్ సర్కార్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇటీవల నాని చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదం అయ్యాయి. ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించి ప్రేక్షకుడిని అవమానపరిచిందని… సినిమా థియేటర్ కలెక్షన్లు, కిరాణా కొట్టు కలెక్షన్ల కన్నా తక్కువగా ఉంటున్నాయంటూ ప్రభుత్వం ఘాటు వ్యాఖ్యలు చేశారు.

SriReddy: ‘ఏంటి నానీ.. నువ్వు కూడా స్క్రిప్ట్ చదువుతున్నావా’..! శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

తన సినిమా శ్యాంసింగరాయ్ పై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చారు. ఏకంగా నాని అంటే ఎవరో తెలియదని మంత్రి అనిల్ కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే నానిపై విమర్శలు చేసింది శ్రీ రెడ్డి. ఫిలిం ఇండస్ట్రీలో శ్రీ రెడ్డి గురించి తెలియని వారుండరు.

SriReddy: ‘ఏంటి నానీ.. నువ్వు కూడా స్క్రిప్ట్ చదువుతున్నావా’..! శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

కాస్టింగ్ కౌచ్ పై గళం ఎత్తింది. ముఖ్యంగా పవన్ కళ్యాన్, నాని, దగ్గుబాటి కుటుంబం సందు దొరికితే విమర్శలు చేస్తుంటుంది. అవకాశాల కోసం టాలీవుడ్ లో కొంత మందికి పడక సుఖాన్ని పంచానని గతంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. టికెట్ రేట్లు తగ్గిస్తే ప్రేక్షకుడిని ఎలా అవమానించినట్లు అవుతుందని.. నానిని ప్రశ్నించింది శ్రీ రెడ్డి. కావాలనే నాని చంద్రబాబు, పవన్ కళ్యాన్ కనుసన్నల్లో తన సామాజిక వర్గానికి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శించింది.

ఇదంతా కపట ప్రేమ..

వాళ్లిచ్చిన స్క్రిప్టు చదువుతున్నారంటూ దుయ్యబట్టారు. గతంలో నిర్మాతల కోసమే ’వీ‘.. టక్ జగదీష్ సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేశారని.. అప్పుడు థియేటర్ల యాజమాన్యాలపై నాని విమర్శలు చేశారని శ్రీ రెడ్డి గుర్తు చేసింది. ఒకప్పుడు థియేటర్లపై ఇలా మాట్లాడిన నాని..ఇప్పుడు వారిపై కపట ప్రేమ నటిస్తున్నారనన్నారు. టికెట్ల రేట్ల విషయంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, ప్రభుత్వం ఓ నిర్ణయానికి వస్తున్న క్రమంలో నాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘బాషా’ తరహా సస్పెన్స్‌తో సమంత ‘మా ఇంటి బంగారం’..రన్‌టైమ్ కూడా ఫిక్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…

20 minutes ago

కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలా? ఇంట్లోనే ఈ రైస్ మాస్క్ ట్రై చేయండి!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్‌కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…

37 minutes ago

రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.. తమిళనాడులో కొత్త చర్చకు తెర..

తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…

1 hour ago

బంగారం కొనాలనుకునేవారికి షాక్.. ఒక్కరోజులోనే భారీ పెరుగుదల!

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…

1 hour ago

రెండేళ్ల జ్ఞానేశ్వరి ఎక్కడ? తునిలో మిస్టరీగా మారిన చిన్నారి అదృశ్యం..

కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…

1 hour ago

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

23 hours ago