Bigg Boss: బాలకృష్ణ బిగ్ బాస్ హోస్టింగ్ పై స్పందించిన నాగార్జున..! క్లారిటీ ఇచ్చేశాడుగా..!
Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 5 ముగిసింది. ఇప్పుడందరిలో సీజన్ 6పై చర్చ ప్రారంభమైంది. అయితే వచ్చే సీజన్ ఓటీటీలో ప్రసారం అవుతుందా.. లేకపోతే స్టార్ మాలోనే ప్రసారం అవుతుందా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో పాటు సీజన్ 6కు హెస్ట్ గా నందమూరి బాలకృష్ణ వ్యవహరిస్తున్నారనే వాదన కూడా నడుస్తోంది. ఇప్పటికే ఆహాలో ’’అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే‘‘ టాక్ షోలో హోస్ట్ గా దుమ్ము రేపుతున్నారు బాలయ్య.
అయితే వీటన్నింటికి సమాధానాలు ఇచ్చారు కింగ్ నాగార్జున. బిగ్ బాస్ 5 ముగియడంతో మరో రెండు రోజుల్లోనే బిగ్ బాస్ 6 కూడా ప్రారంభం అవుతుందని క్లారిటీ ఇచ్చారు నాగార్జున. అయితే దీనికి సంబంధించి కంటెస్టెంట్లు ఎవరో అని తెలియదు. శుక్రవారం ’పరంపర‘ వెబ్ సిరీస్ విడుదల అవుతున్న సందర్భంలో హాట్ స్టార్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.
అయితే టీవీలో వచ్చే బిగ్ బాస్ కు ఓటీటీలో వచ్చే బిగ్ బాస్ కు తేడా ఉంటుందని ఆయన అన్నారు. దీనిని కొత్తగా ప్రోగ్రామింగ్ చేస్తున్నామని.. ఇందులో ఉండే సెలబ్రెటీలు ఎవరో తెలియదని నాగార్జున అన్నారు. ఓ పక్క సినిమాలు.. మరో పక్క బిగ్ బాస్ షో ఒత్తడి అనిపించదా.. అనే ప్రశ్నకు సమాధానంగా .. నాకు ఒత్తడి ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా వర్క్ చేస్తానని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ నాకు ఫ్యామిలీగా అనిపిస్తుందని కామెంట్ చేశారు.
బిగ్ బాస్ ను ప్రేక్షకులే కాదు..నేను మిస్ అవుతున్నానని చెప్పారు. మీరు చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ కు తేడా లేమిటి అని అడగ్గా.. మీలో ఎవరు కోటీశ్వరుడు నాలెడ్జ్ షో అని… బిగ్ బాస్ దీనికి పూర్తిగా విభిన్నంగా ఉంటుందని.. ఇక్కడ వ్యక్తులపై నాలెడ్జ్ వస్తుందని ఆయన అన్నారు. ఇప్పుడు అందర్ని తొలుస్తున్న ప్రశ్నకు కూడా నాగార్జున సమాధానం ఇచ్చారు.
బిగ్ బాస్ 6 లో మీరు హోస్ట్ గా వ్యవహరించరని వార్తలు వస్తున్నాయి… వేరే వాళ్లు హోస్ట్ గా చేస్తున్నట్లు తెలిసింది అన్న ప్రశ్నకు నాగార్జున క్లారిటీ ఇచ్చారు. వచ్చే బిగ్ బాస్ 6 సీజన్ కు కూడా నేనే హోస్ట్ గా ఉంటానని స్పష్టం చేశాడు. దీంతో బాలయ్య హోస్ట్ గా చేస్తున్నారనే పుకార్లకు తెర పడినట్లు అయింది.
ప్రస్తుతం వస్తున్న బిగ్ బాస్ 6.. హాట్ స్టార్ లో వేరేలా.. స్టార్ మాలో వేరేలా ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో ను కూడా త్వరలో విడుదల చేయనున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…