Pushpa Dialogue: క్రికెటర్ నోటి వెంట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైలాగ్..‘నీయవ్వ తగ్గేదేలే’..అంటూ..!
Pushpa Dialogue: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ప్యాన్ ఇండిమా మూవీ అభిమానులను అలరిస్తోంది. అన్ని భాషల్లో కలెక్షన్ల విషయంలో దుమ్ము రేపుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, బన్నీ కలయికతో వచ్చిన ఈసినిమా విడుదల కన్నా ముందు నుంచే రికార్డులు క్రియేట్ చేస్తోంది.
ముఖ్యంగా బన్నీ చెప్పిన డైలాగ్ అందరిని ఆకట్టుకుంది. ‘నీయవ్వ తగ్గదే లేదు’ అంటూ డైలాగ్ చెప్పిన స్టైల్ అందరిని ఆకట్టుకుంది. ఈ డైలాగ్ జనాల నోటిలో నానుతోంది. బన్నీ మ్యానరిజం సెలబ్రెటీలను కూడా మెస్మరైజ్ చేసింది.
దీంతో అన్ని భాషల్లో పుష్పకు మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా బన్నీ డైలాగ్ క్లబ్ లో చేరారు. ట్విట్టర్ వేదికగా బన్నీ చెప్పిన డైలాగ్ ను దింపేశాడు. దీంతో బన్నీ అభిమానులు హ్యాపీ అవుతున్నారు. తమ స్టార్ డైలాగ్ కు దేశవ్యాప్తంగా ఫేమ్ వచ్చిందంటూ అభిమానులు ఆనందపడిపోతున్నారు.
గాయం కారణంగా సౌతాఫ్రికా టూర్ కు దూరంగా ఉన్న జడేజా బెంగళూర్ లో నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టిస్ చేస్తున్నాడు. అయితే పుష్ప సినిమాలో లాగే… జడేజా కూడా మాసిన గడ్డంతో రగ్డ్ లుక్ తో మరో పుష్పగా మారారు. పుష్ప చెప్పిన విధంగానే డైలాగ్ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక పుష్ప అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి రవీంద్ర జడేజా వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘పుష్ఫ రి రైజ్’కు సక్సెస్ టాక్ రావడంతో.. సక్సెస్ ఈవెంట్లతో పుష్ప టీం సందడి చేస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…