Featured

Police Story : స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపోయేలా.. పోలీస్ పాత్రలో రెచ్చిపోయిన సాయికుమార్ కు సెల్యూట్ కొట్టాల్సిందే.!!

టాలీవుడ్ లో హీరోలందరు పోలీస్ పాత్రలో కనిపించడం ఇప్పుడు వచ్చిన కొత్త ట్రెండ్ ఏమీ కాదు.తరచి చూస్తే.. ఆనాటి నుంచి నేటి వరకు పోలీస్ పాత్రలేని దాదాపుగా సాంఘిక చిత్రాలు లేవని చెప్పవచ్చు. ఎన్టీ రామారావు మొదలుకొని ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ ఇలా ఎంతోమంది పోలీస్ పాత్రలో వెండి తెరపై కనిపించారు.

Police Story : స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపోయేలా.. పోలీస్ పాత్రలో రెచ్చిపోయిన సాయికుమార్ కు సెల్యూట్ కొట్టాల్సిందే.!!

సమాజంలో అవినీతి, అన్యాయం, నేరాలు అరికట్టడంలో పోలీస్ పాత్ర ప్రాధాన్యత ఉండేది. కానీ కాలగమనంలో పోలీస్ క్యారెక్టరైజేషన్ లో చాలా మార్పులు వచ్చాయి. సినిమాల్లో మార్పులు వచ్చినట్టే పోలీస్ పాత్రలో కూడా మార్పులు వచ్చాయి. సినిమా ప్రథమార్థంలో అవినీతి అధికారిగా కనిపించిన హీరో, ద్వితీయార్ధంలో నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండే అధికారి గా కనిపించడం కొత్తగా మొదలైన ట్రెండ్ గా పేర్కొనవచ్చు. పోలీస్ అంటే ఎప్పుడు సీరియస్సేనా కాస్తంత కామెడీ ఉండకూడదు అనే ఉద్దేశంతో వచ్చిన చిత్రమే ‘గబ్బర్ సింగ్’. మిగతా పోలీస్ చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా కొత్త ట్రెండ్ సృష్టించింది.

Police Story : స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపోయేలా.. పోలీస్ పాత్రలో రెచ్చిపోయిన సాయికుమార్ కు సెల్యూట్ కొట్టాల్సిందే.!!

సీనియర్ ఎన్టీఆర్ కొండవీటి సింహం, విజయశాంతి కర్తవ్యం, రాజశేఖర్ అంకుశం, బాలకృష్ణ రౌడీ ఇన్స్పెక్టర్, జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ లాంటి పోలీస్ కథతో వచ్చి గుర్తుండిపోయే చిత్రాలుగా పేర్కొనవచ్చు. ఇకపోతే వీటన్నిటికీ భిన్నంగా సాయికుమార్ నటించిన ‘పోలీస్ స్టోరీ’ చిత్రంగా పేర్కొనవచ్చు. ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్, అగ్రెసివ్ నెస్ అంతకుమించి డైలాగు పొటెన్షయాలిటీ లాంటి ఫీచర్స్ తో మిగతా చిత్రాల్లో కనిపించని కొత్త పోలీస్ ని ఈ చిత్రంలో ప్రేక్షకులు చూశారు. కంటికి కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలయితే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్.. అనే డైలాగ్ సాయికుమార్ చెప్పడంతో సినిమా థియేటర్ మొత్తం దద్దరిల్లుతోంది…

Police Story : స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపోయేలా.. పోలీస్ పాత్రలో రెచ్చిపోయిన సాయికుమార్ కు సెల్యూట్ కొట్టాల్సిందే.!!

విలన్ ఇంటికి వెళ్లి సాయికుమార్ దాదాపు పది మంది గూండాలు వచ్చి దాడి చేసినప్పుడు వారిపై ఎదురుతిరిగి సాయికుమార్ చితక కొడతాడు. గాయాలతో ఉన్న సాయికుమార్ అదే ఇంట్లో ఉన్న విలన్ తల్లితో అమ్మ.. సత్య, ధర్మ అని ఈ పాపిస్టోల్లకు ఆ పేర్లు ఎందుకు పెట్టావమ్మ.. ఆ.. నువ్వు మాత్రం కళగన్నావా ఇలా పుడతారని… సాయికుమార్ ఎమోషనల్ గా చెప్పిన ఈ సంభాషణ ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేస్తుంది… ట్రాఫిక్ లో రోడ్డుపై ఒక మంత్రి కారు నిర్దాక్షిణ్యంగా సాయికుమార్(పోలీస్) ఆపారని ఎమ్మెల్యేలు, మంత్రులు డీజీపీకి ఫిర్యాదు చేస్తుండగా.. సాయి కుమార్ అక్కడికి ప్రవేశించి.. రాజకీయ నాయకుల పిల్లలు కిడ్నాప్ అయితే పోలీస్ కావాలి..మీ ఎలక్షన్స్ కు పోలీస్ కావాలి.. మీ ప్రొటెక్షన్ కి పోలీస్ కావాలి.. కానీ ఆ సమయంలో ఎంత మంది పోలీసులు చనిపోయిన మీకు లెక్కలేదు.. అని చెప్పగానే కాన్ఫరెన్స్ హాలు మొత్తం దద్దరిల్లుతుంది.

Police Story : స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపోయేలా.. పోలీస్ పాత్రలో రెచ్చిపోయిన సాయికుమార్ కు సెల్యూట్ కొట్టాల్సిందే.!!

సాయికుమార్ పోలీస్ పాత్రలో పండించిన ఈ తరహా రౌద్రం.. నభూతో నభవిష్యత్ అనే చెప్పాలి. ఒక యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ గా అంత అగ్రెసివ్ ఇంటెన్సిటీ తో బిహేవియర్ చేయడం ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. కథలో కొత్తదనం లేకపోయినా పోలీస్ గా సాయికుమార్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకి ఫిదా అయిపోయారు. 1996లో స్టంట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు దర్శకత్వంలో వచ్చిన కన్నడ అనువాద చిత్రం “పోలీస్ స్టోరీ” బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago