మందులు ఇవ్వడానికి వెళ్తుంటే..! హీరో నిఖిల్ ను అడ్డుకున్న పోలీసులు.. ఈపాస్ ఉండాల్సిందే అన్నారట..!

కరోనా ఉదృతి నేపధ్యంలో ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ సాహయం చేస్తున్నాడు హీరో నిఖిల్. తనకు ట్వీట్ చేసిన వారికి ఇంజేక్షన్స్, ఆక్సిజన్, బెడ్స్ మరియు మందులను అందిస్తూ శెభాష్ అనిపించుకుంటున్నాడు. మరీ సోనూసూద్ అంత కాకపోయినా తనకు చేతనైనంత సహాయం చేస్తున్నాడు నిఖిల్. కరోనా ఉదృతి దృష్ట్యా తెలంగాణలో లాక్ డౌన్ ను కఠినతరం చేసారు అధికారులు. కాగా, కోవిడ్ బాదితుడికి మందులు అందించేందుకు ఆసుపత్రికి వెళ్తుండగా మధ్యలో ఆయనను పోలీసులు నిలిపివేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్వీట్ లో తెలిపారు.

కరోనా వల్ల తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తికీ మందులు అందించేందుకు ఉప్పల్ నుండి మినిస్టర్ రోడ్ కిమ్స్ కు వెళ్తుండగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ వద్ద పోలీసులు నిఖిల్ కారును ఆపేశారు. ఆ సమయంలో బాధితుడి వివరాలు, మందుల చీటీ చూపించినా కూడా పోలీసులు నిఖిల్ ను వెళ్లేందుకు అనుమతించలేదు. ఖచితంగా ఈ పాస్ ఉండాలని తేల్చి చెప్పారు. అయితే ఈ పాస్ కోసం ట్రై చేస్తుంటే సర్వర్లు డౌన్ ఉండటం వల్ల తనకు ఈ పాస్ దొరకలేదని అయన ట్వీట్ చేసారు.

హీరో నిఖిల్ ట్వీట్ పై వెంటనే స్పందించిన హైదరాబాద్ సిటీ పోలీసు విభాగం “సార్ మీ లొకేషన్ మాకు పంపించండి.. తాము పోలీసులతో మాట్లాడి మీ సమస్య తీరుస్తాము” అంటూ రిప్లై ఇచ్చారు. ఈ క్రమంలో హీరో నిఖిల్ లొకేషన్ సమాచారం అందించగా వెంటనే లైన్ క్లియర్ చేసి పంపించారు. ఈ క్రమంలో అత్యవసరమైన అవసరం ఉన్నవారికి లాక్ డౌన్ లో అనుమతి ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.