సులభంగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే మిరియాలు వాడాల్సిందే!

భారతదేశంలో గత కొన్ని సంవత్సరాల నుంచి మిరియాలను వివిధ రకాల వంటలలో ఉపయోగిస్తున్నారు.మిరియాలు వంటల్లో ఉపయోగించడం వల్ల వంటకు రుచి కల్పించడం మాత్రమే కాకుండా మన శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. చాలామంది ఆహార పదార్థాలలో ఈ మిరియాలు కనిపించినప్పుడు వాటిని తీసి పక్కన పెడుతుంటారు. అలా చేయటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మనం కోల్పోతాము.

అధిక శరీర బరువుతో బాధపడేవారు రోజూ రెండు మిరియాలను తమలపాకులో వేసుకొని నమలడం ద్వారా సులభంగా శరీర బరువు తగ్గవచ్చు. మిరియాల లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉన్న కొవ్వును కరిగించి శరీర బరువును నియంత్రించడానికి దోహదపడతాయి. అదే విధంగా ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలోకి కొద్దిగా తేనే, నిమ్మరసం, కలుపుకుని తాగడం వల్ల బరువు తగ్గవచ్చు.

నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం, తులసి ఆకులను బాగా మరిగించి వాటితో కషాయం తయారుచేసుకొని ప్రతిరోజు పరగడుపున త్రాగటం వల్ల బరువును తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఒక గ్లాసు మజ్జిగలోకి మిరియాల పొడి కలుపుకొని త్రాగటం వల్ల కూడా జీర్ణక్రియ సమస్యలు, కడుపులో మంట అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి.

నల్ల మిరియాలను ఉపయోగించి శరీర బరువు తగ్గించుకోవడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అదేవిధంగా చర్మ సంబంధిత సమస్యల నుంచి కూడా పూర్తిగా ఉపశమనం పొందవచ్చు. అయితే గర్భం దాల్చిన మహిళలు మిరియాలకు దూరంగా ఉండటం మంచిది. నల్లమిరియాలు కొందరిలో కొన్ని సార్లు అబార్షన్ కలిగించే అవకాశాలు ఉంటాయి.