మన దేశంలో కరోనా సెంకండ్ వేవ్ ఉగ్రరూపం దాలుస్తుంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. రోజువారీ కేసుల ప్రళయం 3 లక్షలకు చేరువైంది. గత వారం రోజులుగా రోజుకు 2 లక్షల కేసులు దాటాయి. ఈ నేపధ్యంలో గడిచిన 24 గంటల్లో మన దేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో 2,95,041 పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఒక్కరోజులో కరోనాతో 2,023 మంది మరణించారు. ఇక రాష్ట్రాలలో మహారాష్ట్ర అత్యధికంగా 62,097 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఇక మొత్తం మృతుల సంఖ్య 1,82,570కి చేరింది. తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఘననీయంగా పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించారు. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయి. దేశంలో ఇప్పటి వరకు 21లక్షల యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…