UV Creations: ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ పై దాడి చేసిన జీఎస్టీ అధికారులు… కారణం అదేనా!

UV Creations: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నిర్మాణ సంస్థలు ఉన్నాయని చెప్పాలి. ఈ క్రమంలోనే 2013 వ సంవత్సరంలో ప్రభాస్ సోదరుడు ప్రమోద్ అతని స్నేహితులు కలిసి నిర్మించినటువంటి నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్. ఇలా 2013 వ సంవత్సరంలో స్థాపించిన ఈ నిర్మాణ సంస్థలో మొదటిగా ప్రభాస్ నటించిన మిర్చి సినిమాని నిర్మించారు.

ఈ విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించిన యువి క్రియేషన్స్ పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను కూడా తన బ్యానర్ లో నిర్మించారు. ఈ విధంగా ఎన్నో సినిమాలను నిర్మించిన యువి క్రియేషన్స్ నిర్మాణ సంస్థపై తాజాగా జిఎస్టి అధికారులు దాడులు నిర్వహించారు.హైదరాబాద్‌లోని కావూరి హిల్స్‌లో ఉన్న సంస్థ కార్యాలయంలో జీఎస్టీ అధికారులు దాడులు చేశారు.

UV Creations: సోదాలు నిర్వహిస్తున్న అధికారులు…


ఈ సందర్భంగా ఈ విషయంపై అధికారులు స్పందించి యువి నిర్మాణ సంస్థ పొందుతున్న లాభాలకు వారు చెల్లిస్తున్నటువంటి జిఎస్టి టాక్స్ లకు ఏమాత్రం పొంతన లేకపోవడంతోనే దాడులు నిర్వహించామని వెల్లడించారు. ఇలా ఈ సోదాలలో భాగంగా యువి నిర్మాణ సంస్థ సుమారు 6 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేదని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ విషయంపై అధికారులు మరింత లోతుగా విచారణ జరుపనున్నట్లు తెలుస్తోంది.