Samantha -Naga Chaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్ని సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాలవల్ల విడాకులు తీసుకొని విడిపోయారు.
నాగచైతన్య నుంచి విడిపోయిన సమంత ఒంటరిగా జీవిస్తూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే సమంత గత కొంత కాలం నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజమేనని తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను అంటూ సమంత సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఈ విధంగా సమంత తాను బాధపడుతున్న అనారోగ్య సమస్య గురించి బయట పెట్టడంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు సమంతా త్వరగా తిరిగి కోల్పోవాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ తనకు ధైర్యం చెబుతున్నారు.ఇక అక్కినేని కుటుంబం నుంచి అఖిల్ సుశాంత్ వంటి వారు కూడా సమంత త్వరగా కోలుకోవాలని పోస్టులు పెట్టారు.
సమంత అనారోగ్య సమస్యతో బాధపడుతుందని తెలిసినప్పటి నుంచి అందరి ఫోకస్ నాగచైతన్య పై పడింది. నాగచైతన్య సమంతను వెళ్లి పరామర్శిస్తారా అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా సమంతను పరామర్శించకపోయిన నేరుగా తనని కలిసి తనని పరామర్శించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా అక్కినేని కాంపౌండ్ నుంచి వస్తున్న వార్తలు ప్రకారం అక్కినేని కుటుంబ సభ్యులు ఎవరు కూడా సమంతను కలవడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది.విడాకుల ప్రకటన చేసిన తరుణంలో తామిద్దరం ఇకపై మంచి స్నేహితులుగా కొనసాగుతామని చెప్పినప్పటికీ వీరి మధ్య కనీసం స్నేహబంధం కూడా లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాగచైతన్య వెళ్లి సమంతను పరామర్శిస్తారనేది పూర్తిగా అబద్ధమని ఇది జరిగే పని కాదంటూ మరికొందరు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి నిజంగానే నాగచైతన్య సమంతను పరామర్శిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…