Jahnvi Kapoor: ఈ మధ్యకాలంలో నటీనటులు తమ సినిమాని ప్రమోట్ చేయడం కోసం సరికొత్త ప్రయత్నాలను చేస్తూ పెద్ద ఎత్తున నేటిజన్ ల ఆగ్రహానికి గురవుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఇలా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ పెద్ద ఎత్తున నేటిజన్ ల ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ సైతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చేసిన పని పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన చిత్రం మిల్లి. ఈ సినిమా నవంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో హాజరైనటువంటి ఈమె తాజాగా ఢిల్లీలోని ఒక మల్టీప్లెక్స్ థియేటర్ లో దర్శనమిచ్చారు. అయితే అక్కడ జాన్వీ కపూర్ ను చూసినటువంటి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఢిల్లీలోని ఒక మల్టీప్లెక్స్ థియేటర్లో పాప్ కార్న్ అమ్ముతూ కనిపించారు. ఇలా జాన్వీ కపూర్ పాప్ కార్న్ అమ్మడం ఏంటి అని అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురికాగా అనంతరం ఇది తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చేశారని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఈ వీడియో పై స్పందిస్తూ.. సినిమా ప్రమోషన్ల కోసం ఏం చేయడానికైనా వెనకాడరు కదా…చివరికి వాష్ రూమ్ క్లీన్ చేయమన్న చేస్తారు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అదేవిధంగా మరికొందరు నువ్వు బోనీకపూర్ కూతురు కాకపోయి ఉంటే నీకు ఈ పని కరెక్ట్ గా సరిపోయేది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి జాన్వీ కపూర్ చేసిన పని కారణంగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ కి గురవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…