UV Creations: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నిర్మాణ సంస్థలు ఉన్నాయని చెప్పాలి. ఈ క్రమంలోనే 2013 వ సంవత్సరంలో ప్రభాస్ సోదరుడు ప్రమోద్ అతని స్నేహితులు కలిసి నిర్మించినటువంటి నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్. ఇలా 2013 వ సంవత్సరంలో స్థాపించిన ఈ నిర్మాణ సంస్థలో మొదటిగా ప్రభాస్ నటించిన మిర్చి సినిమాని నిర్మించారు.
ఈ విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించిన యువి క్రియేషన్స్ పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను కూడా తన బ్యానర్ లో నిర్మించారు. ఈ విధంగా ఎన్నో సినిమాలను నిర్మించిన యువి క్రియేషన్స్ నిర్మాణ సంస్థపై తాజాగా జిఎస్టి అధికారులు దాడులు నిర్వహించారు.హైదరాబాద్‌లోని కావూరి హిల్స్‌లో ఉన్న సంస్థ కార్యాలయంలో జీఎస్టీ అధికారులు దాడులు చేశారు.
ఈ సందర్భంగా ఈ విషయంపై అధికారులు స్పందించి యువి నిర్మాణ సంస్థ పొందుతున్న లాభాలకు వారు చెల్లిస్తున్నటువంటి జిఎస్టి టాక్స్ లకు ఏమాత్రం పొంతన లేకపోవడంతోనే దాడులు నిర్వహించామని వెల్లడించారు. ఇలా ఈ సోదాలలో భాగంగా యువి నిర్మాణ సంస్థ సుమారు 6 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేదని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ విషయంపై అధికారులు మరింత లోతుగా విచారణ జరుపనున్నట్లు తెలుస్తోంది.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…