Vaishnavi Chaitanya Brother: నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా… వైష్ణవి చైతన్య తమ్ముడు పై భారీ ట్రోల్స్!

Vaishnavi Chaitanya Brother: బేబీ సినిమాతో ఒక్కసారిగా వైష్ణవి చైతన్య పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. యూట్యూబర్ గా ఎన్నో వెబ్ సిరీస్లలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వైష్ణవి చైతన్య బేబీ సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇలా ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది.

ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో పెద్ద ఎత్తున సక్సెస్ ఈవెంట్ కార్యక్రమాలను నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా వైష్ణవి చైతన్య తమ్ముడు మాత్రం భారీగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఇలా వైష్ణవి తమ్ముడు ట్రోల్స్ ఎదుర్కోవడానికి కారణమేంటి అనే విషయానికి వస్తే వైష్ణవి తన తమ్ముడితో కలిసి విజయ్ దేవరకొండ ఆనంద దేవరకొండలతో కలిసి ఒక ఫోటో దిగారు. ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Vaishnavi Chaitanya Brother: యాటిట్యూడ్ తగ్గించుకుంటేనే మంచిది…


ఈ ఫోటోలలో వైష్ణవి చైతన్య సోదరుడు కాస్త యాటిట్యూడ్ చూపించడమే ఇందుకు కారణం అని చెప్పాలి. ఈ ఫోటోలలో ఈయన ఏకంగా విజయ్ దేవరకొండ పైనే చేయి వేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దీంతో మండిపడిన విజయ్ ఫ్యాన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నారు.నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా నీతో ఫోటో దిగడం కోసం విజయ్ ఆనంద్ దేవరకొండలో నీ ఇంటికి వచ్చారా ఇలాంటి యాటిట్యూడ్ తగ్గించుకుంటేనే మంచిది అంటూ మండిపడుతున్నారు. మరికొందరైతే అక్క హిట్టు కొడితే తమ్ముడు యాటిట్యూడ్ చూపించడం ఏంటో అంటూ భారీ స్థాయిలో ఈ ఫోటోపై ట్రోల్స్ చేస్తున్నారు.