Vasishta -Haripriya: కేజిఎఫ్ నటుడితో హరిప్రియ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్!

Vasishta -Haripriya: కే జి ఎఫ్ నటుడు వశిష్ఠ ఎన్ సింహ హరిప్రియ రహస్యంగా ప్రేమ ప్రయాణం కొనసాగించిన విషయం మనకు తెలిసిందే. వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉంటూ వీరి ప్రేమ విషయాన్ని బయటపడకుండా జాగ్రత్తపడ్డారు. అయితే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో వీరి నిశ్చితార్ధాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

ఈ జంట నిశ్చితార్థం జరుపుకోనున్న నేపథ్యంలో వీరిద్దరూ కలిసి దుబాయ్ వెళ్లి షాపింగ్ చేశారు. అయితే దుబాయ్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో బెంగళూరు ఎయిర్ పోర్టులో మీడియా కంటికి కనిపించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయం బయటపడింది. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట డిసెంబర్ మొదటి వారంలోని నిశ్చితార్థం చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇక వీరి నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగిందని ఈ నిశ్చితార్థం సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Vasishta -Haripriya:రహస్యంగా ప్రేమ ప్రయాణం కొనసాగించిన జంట…

హరి ప్రియ పిల్ల జమిందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ ఈ వర్షం సాక్షిగా బాలకృష్ణ సింహ వంటి పలు సినిమాలలో నటించి మెప్పించారు.ఇలా పలు సినిమాలలో నటిస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడటం ఆ పరిచయం ప్రేమగా మారడంతో వీరి ప్రేమ వ్యవహారాన్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా కొనసాగించారు. ఇక డిసెంబర్ 3న వీరి నిషితార్థం ఘనంగా జరగడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దీంతో ఎంతోమంది అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.