Vasishta -Haripriya: కే జి ఎఫ్ నటుడు వశిష్ఠ ఎన్ సింహ హరిప్రియ రహస్యంగా ప్రేమ ప్రయాణం కొనసాగించిన విషయం మనకు తెలిసిందే. వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉంటూ వీరి ప్రేమ విషయాన్ని బయటపడకుండా జాగ్రత్తపడ్డారు. అయితే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో వీరి నిశ్చితార్ధాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు.
ఈ జంట నిశ్చితార్థం జరుపుకోనున్న నేపథ్యంలో వీరిద్దరూ కలిసి దుబాయ్ వెళ్లి షాపింగ్ చేశారు. అయితే దుబాయ్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో బెంగళూరు ఎయిర్ పోర్టులో మీడియా కంటికి కనిపించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయం బయటపడింది. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట డిసెంబర్ మొదటి వారంలోని నిశ్చితార్థం చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇక వీరి నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగిందని ఈ నిశ్చితార్థం సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
హరి ప్రియ పిల్ల జమిందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ ఈ వర్షం సాక్షిగా బాలకృష్ణ సింహ వంటి పలు సినిమాలలో నటించి మెప్పించారు.ఇలా పలు సినిమాలలో నటిస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడటం ఆ పరిచయం ప్రేమగా మారడంతో వీరి ప్రేమ వ్యవహారాన్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా కొనసాగించారు. ఇక డిసెంబర్ 3న వీరి నిషితార్థం ఘనంగా జరగడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దీంతో ఎంతోమంది అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…