Venu Thottempudi : వడ్డే నవీన్, సిమ్రాన్ ఇద్దరూ అక్కడే పరిచయం.. కానీ వడ్డే నవీన్ ఎందుకో అసలు మాతో మాట్లాడేవాడు కాదు : వేణు తొట్టెంపూడి

Venu Thottempudi : 1999 లో వచ్చిన ‘స్వయంవరం’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు వేణు. తొలి సినిమాతోనే విజయాన్ని సాధించిన అభిమానులకు చేరువ అయ్యాడు. ఈయన సినిమాలు కుటుంబ సమేతంగా చూడదగినవిగా ఉంటాయన్న పేరు తెచ్చుకున్నాడు. చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, ఖుషి ఖుషిగా వంటి సినిమాసలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే 2013 లో విడుదల అయిన రామాచారి సినిమా తరువాత సినిమాలు వదిలేసి అమెరికా లో స్థిరపడ్డాడు. ఇపుడు ‘రామరావు ఆన్ డ్యూటీ’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

వడ్డే నవీన్ ను చూసి ఈయన తెలుగు వాడేనా అని అనిపించింది…

చదువు తరువాత ముంబై యాక్టింగ్ స్కూల్ లోని సంఘటనల గురించి పలు విషయాలు వేణు ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకోచ్చాడు…. యాక్టింగ్ స్కూల్ లో నాతోపాటు సిమ్రన్, వడ్డే నవీన్, మాంగో రామ్ ఉండేవారు. అందరం సరదాగా ఉండే వాళ్ళం, కానీ నవీన్ మాత్రం ఎవరితోనూ మాట్లాడే వారు కాదు. మొదట్లో ఏంటి అసలు ఈయన తెలుగు వారేనా, అసలు నాతో మాట్లాడరు అనుకున్నా, అయితే తరువాత తెలిసింది అయన అంతే సైలెంట్ అని. కానీ మనం పలకరిస్తే బాగా మాట్లాడతారు అని చెప్పుకొచ్చారు.

ఇక హీరోయిన్ సిమ్రన్ గురించి చెబుతూ… తను చాలా హార్డ్ వర్కర్, మేము చాలా సరదాగా ఉండే వాళ్ళం. అయితే అసలు సిమ్రన్ పేరు రిషి బాల. ఇంకా మాతో పాటు మాంగో రామ్ కూడా ఉన్నారు అని చెప్పారు. అయితే నాకు ముంబాయి చాలా నచ్చడంతో వెంటనే అవకాశాల కోసం హైదరాబాద్ కి రాకుండా సరదాగా ముంబాయి లోనే మరో 4 నెలలు ఉన్నాను అని చెప్పారు.