Uma Maheswari: దివంగత నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమార్తె కంటమనేని ఉమామహేశ్వరి సోమవారం ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని మరణించడంతో ఒక్కసారిగా నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈమె మరణ వార్త తెలియగానే నందమూరి కుటుంబ సభ్యులందరూ హుటాహుటిన తన ఇంటికి చేరుకున్నారు.ఇకపోతే నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు దగ్గరుండి ఆమె అంత్యక్రియలను కూడా పూర్తి చేశారు.బుధవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో హిందూ సాంప్రదాయాలు ప్రకారం ఈమెకు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.
ఇకపోతే నందమూరి బాలకృష్ణ తన చెల్లెలి పాడే మోస్తూ తన చెల్లెలికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఇక ఈమె అంత్యక్రియలలో భాగంగా పలువురు రాజకీయ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇలా బాలయ్య చెల్లెలకు పాడే మోయడం చూసిన అభిమానులు కంటి తడి పెట్టుకున్నారు.ఇక అంత్యక్రియలలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు లోకేష్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి పలువురు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు.
ఇక మహాప్రస్థానంలో ఉమామహేశ్వరి భౌతిక కాయానికి తన భర్త దహన సంస్కారాలు నిర్వహించారు. అయితే ఈమె వ్యక్తిగతంగా ఎంతో మంచి మనసున్న వ్యక్తి ఎందరికో సహాయం చేసిన ఉమామహేశ్వరి ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అనే విషయం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఏది ఏమైనా ఎంతో ఒక మంచి మనసున్న ఉమామహేశ్వరీ ఇలా ఆత్మహత్య చేసుకోవడం నందమూరి కుటుంబానికి తీరని లోటు అంటూ పలువురు భావిస్తున్నారు.ఇకపోతే ఈమె అంత్యక్రియలకు నందమూరి కుటుంబం మొత్తం హాజరైనప్పటికీ ఎన్టీఆర్ మాత్రం దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన తన ఫ్యామిలీతో కలిసి లండన్ వెకేషన్ లో ఉండటం వల్ల తన అత్తయ్య అంత్యక్రియలకు రాలేకపోయారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…