Actress Poorna: నటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటించి గుర్తింపు సంపాదించుకున్న పూర్ణ ప్రస్తుతం సినిమాలలో సెకండ్ హీరోయిన్ పాత్రలలో నటిస్తున్నారు. అయితే ఈమె సీమటపాకాయ్ అవును వంటి సినిమాలతో ప్రేక్షకులను సందడి చేశారు.సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఈమె బుల్లితెర కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ఇలా బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరించిన ఈమె ప్రస్తుతం బుల్లితెరకు కూడా దూరమయ్యారు.ఇకపోతే నటిగా గుర్తింపు పొందిన పూర్ణ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతుందని తనకు కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసిన విషయం మనకు తెలిసిందే.
పెద్దల అంగీకారంతో తాను దుబాయ్ కి చెందిన ఒక బిజినెస్మేన్ షానిద్ అసిఫ్ అలీతో నిశ్చితార్థం కూడా జరుపుకుందని వెల్లడించారు. ఇలా తనకు కాబోయే భర్తను పూర్ణ పరిచయం చేయడంతో పెద్ద ఎత్తున అభిమానులు తనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వివాహం తర్వాత పూర్ణ నటనకు దూరమవుతుందని వార్తలు వచ్చినప్పటికీ తన భర్త మాత్రం తనకు నటించే అవకాశాన్ని కల్పించారని పేర్కొన్నారు.
ఇలా త్వరలోనే వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్న సమయంలో పూర్ణ గురించి ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్ణ తన వివాహాన్ని క్యాన్సిల్ చేసుకుందని పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా ఈమె వివాహం క్యాన్సిల్ కావడానికి కారణం ఒక దర్శకుడు అంటూ ప్రచారం అవుతుంది. పూర్ణ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ దర్శకుడితో ప్రేమలో ఉందని, ఈ ప్రేమ విషయం బయటకు రావడంతో తన పెళ్లి క్యాన్సిల్ అయిందని వార్త చెక్కర్లు కొడుతుంది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే పూర్ణ స్పందించాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…