RGV: వర్మ బ్రెయిన్ మామూలుగా లేదుగా… ‘డేంజరస్’ కోసం కేఏ పాల్ ను వాడేసిన వర్మ!

RGV: ప్రజాశాంతి పార్టీ అధినేత కె ఏ పాల్ చేసే వ్యాఖ్యలు ఎంతటి హాస్యాస్పదంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆయన చేసే వ్యాఖ్యలు వింటే ప్రతి ఒక్కరికి నవ్వొస్తుంది. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా గురించి కె ఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా రోజుకొక సినిమా చూస్తూ మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు అంటూ ఈయన ఈ సినిమాపై స్పందించారు.

RGV: వర్మ బ్రెయిన్ మామూలుగా లేదుగా… తన డేంజరస్ సినిమా కోసం కే.ఏపాల్ ను వాడుకున్న వర్మ!

పని పాట లేకుండా ఇలాంటి సినిమాలు ఎందుకు చూస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ నీ మొహం రా అంటూ కామెంట్ చేశారు. అయితే అప్పుడు కే ఏ పాల్ చేసిన ఈ వ్యాఖ్యలపై వర్మ తన అద్భుతమైన తెలివితేటలను ఉపయోగించి తన సినిమాకు ప్రమోషన్ కార్యక్రమాలకు ఉపయోగించుకున్నారు.

RGV: వర్మ బ్రెయిన్ మామూలుగా లేదుగా… తన డేంజరస్ సినిమా కోసం కే.ఏపాల్ ను వాడుకున్న వర్మ!

ఈ క్రమంలోనే పాల్ మాట్లాడుతూ RRR వంటి సినిమాలు విడుదలైతే మొదటి రోజే థియేటర్ కి వెళ్లి టైం వేస్ట్ చేసుకొని ఇలాంటి సినిమాలను చూస్తారు. ఇలాంటి సినిమాలు చూసే కన్నా, వర్మ డేంజరస్ సినిమాని మొదటి రోజే వెళ్లి చూడండి. మీతో పాటు మీ చుట్టూ ఉన్నవారికి కూడా ఈ సినిమాని చూపించండి అంటూ వాయిస్ ఛేంజ్ వీడియోని వర్మ ట్విటర్లో పోస్ట్ చేసి తన సినిమాకి కావలసినంత ప్రమోషన్స్ నిర్వహించారు.

వర్మపై కామెంట్ల వర్షం…

ప్రస్తుతం వర్మ ఈ వీడియోని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై ఎప్పటిలాగే తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. వర్మ బ్రెయిన్ మామూలుగా లేదు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియోని వర్మ షేర్ చేస్తూ థాంక్యూ సర్ అంటూ చెప్పుకొచ్చారు.