Allu Bobby: మెగా అల్లుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ను చాలామంది మెగాస్టార్ చిరంజీవితో పోలుస్తూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చిరంజీవి మాదిరిగానే సినిమా కోసం ఎంతో కష్టపడే తత్వం అల్లుఅర్జున్ లో ఉందని చాలామంది అల్లు అర్జున్ ను చిరంజీవితో పోలుస్తుంటారు.
ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మొదటిసారిగా అల్లు బాబీ గని సినిమాతో నిర్మాతగా మారిపోయారు.ఈ సినిమా ఈ నెల 8వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు బాబీకి యాంకర్ నుంచి ఇదే ప్రశ్న ఎదురయింది.
ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ మెగాస్టార్ చిరంజీవికి అల్లు అర్జున్ కి ఏ మాత్రం పోలిక లేవు. ఎప్పుడూ కూడా చిరంజీవితో అల్లు అర్జున్ ని పోల్చలేము అంటూ సమాధానం చెప్పారు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మెగాస్టార్ స్థాయికి ఎదిగారు.
మేమందరం అల్లు రామలింగయ్య మనవళ్లుగా, అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాము. చిరంజీవి మాకు ఎప్పుడు ఒక ఇన్స్పిరేషన్ ఆయన నుంచి మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. అంతే తప్ప ఎప్పుడు మెగాస్టార్ చిరంజీవితో మమ్మల్ని మేము పోల్చుకోమని ఈ సందర్భంగా అల్లు బాబీ మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…