Vijay Devarakonda: ఖచ్చితంగా ప్రేమ వివాహం చేసుకుంటా… విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!

Vijay Devarakonda: నటుడు విజయ్ దేవరకొండ త్వరలోనే ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.  ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా విజయ్ దేవరకొండ ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ నటించారు.

ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటుడు విజయ్ దేవరకొండ తమిళనాడులో నిర్వహించినటువంటి ఓ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన వృత్తిపరమైన జీవితంతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన పెళ్లి గురించి మాట్లాడుతూ త్వరలోనే తాను పెళ్లి చేసుకుంటానని తెలిపారు. తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని అందరిలా తాను తండ్రి కావాలనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తెలిపారు. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ తాను తప్పకుండా ప్రేమ వివాహమే చేసుకుంటానని, నా తల్లిదండ్రులకు కూడా ఆ అమ్మాయి నచ్చుతుంది అంటూ విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

రష్మికతో ప్రేమలో..
సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. ఇక రష్మిక విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి వెకేషన్ లకి వెళ్లడం ఆ ఫోటోలను విడివిడిగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. బహుశా రష్మికనే ప్రేమించి ఈయన పెళ్లి చేసుకోబోతున్నారేమో అంటూ ఈ వ్యాఖ్యలపై కామెంట్స్ చేస్తున్నారు.