Vijay Devarakonda: నటుడు విజయ్ దేవరకొండ త్వరలోనే ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా విజయ్ దేవరకొండ ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ నటించారు.
ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటుడు విజయ్ దేవరకొండ తమిళనాడులో నిర్వహించినటువంటి ఓ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన వృత్తిపరమైన జీవితంతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన పెళ్లి గురించి మాట్లాడుతూ త్వరలోనే తాను పెళ్లి చేసుకుంటానని తెలిపారు. తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని అందరిలా తాను తండ్రి కావాలనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తెలిపారు. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ తాను తప్పకుండా ప్రేమ వివాహమే చేసుకుంటానని, నా తల్లిదండ్రులకు కూడా ఆ అమ్మాయి నచ్చుతుంది అంటూ విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
రష్మికతో ప్రేమలో..
సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. ఇక రష్మిక విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి వెకేషన్ లకి వెళ్లడం ఆ ఫోటోలను విడివిడిగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. బహుశా రష్మికనే ప్రేమించి ఈయన పెళ్లి చేసుకోబోతున్నారేమో అంటూ ఈ వ్యాఖ్యలపై కామెంట్స్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…