Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి తాజాగా డిజిటల్ మీడియా ఫ్యాక్టరీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హైదరాబాదులో జరిగినటువంటి ఈ వేడుకకు చిరంజీవి విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు హాజరుకాగా ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు.
ఇక సుమ ఇక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం ఉంటుందనే సంగతి మనకు తెలిసిందే ఈమె హీరోలు అందరితోనూ సరదాగా మాట్లాడటమే కాకుండా వారి పట్ల సరదాగా కొన్ని కామెంట్స్ చేస్తూ అందరిని నవ్విస్తూ ఉంటారు అయితే ఈ వేడుకలో మాత్రం చిరంజీవి సుమ పరువు దారుణంగా తీసేసారు అందరి ముందు మా ఇంట్లో సుమ తన చేతివాటం ప్రదర్శించింది అంటూ పరువు తీస్తారు.
అసలు సుమ చిరంజీవి ఇంట్లో చేతివాటం చూపించడమేంటి అనే విషయానికి వస్తే వేదికపైకి సుమ బ్రౌన్ కలర్ కోర్టు ధరించి చాలా హుందాగా వచ్చారు అయితే ఆమెను చూడగానే చిరంజీవి ఫోన్ తీసుకొని హలో సురేఖ మన్నీమధ్య నాదొక బ్రౌన్ కలర్ సూట్ కనిపించలేదని చెప్పావు కదా అది ఇప్పుడు దొరికింది అది మన సుమ మన ఇంటికి వచ్చినప్పుడు చేతివాటం ప్రదర్శించింది అంటూ సరదాగా మాట్లాడారు.
చేతివాటం చూపించింది..
ఇలా సుమా గురించి మెగాస్టార్ చిరంజీవి వేదికపై మాట్లాడుతూ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ అందరికీ నవ్వులు పూయించాయి. అయితే ఇవన్నీ కూడా చిరంజీవి గారు చాలా సరదాగా మాట్లాడారనే చెప్పాలి.ఇక ఈ వేడుకలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వారందరూ కూడా పాల్గొని సందడి చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…