Vijay Mallya : 10,000 కోట్లు మింగేసిన తిమింగలం… ఇండియా ఇతన్ని రప్పించగలదా… అసలు తప్పు ఎవరిది…!

Vijay Mallya : విజయ్ మాల్యా.. ఈ పేరు వినగానే బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి లండన్ చెక్కేసాడు అనే విషయం గుర్తొస్తుంది. దాదాపు 6000 కోట్ల లోను బకాయిలను తీర్చకుండా లండన్ వెళ్ళిపోయి తల దాచుకుంటున్న విజయ్ మాల్యా అసలు ఎలా అన్ని అప్పులు చేసాడు, వ్యాపారంలో తప్పటడుగులు ఎలా వేసాడు, ఒకప్పుడు ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ కి వచ్చిన విజయ్ మాల్యా టాప్ టెన్ బిలినియర్ లిస్ట్ లో ఉండే విజయ్ మాల్యా అప్పులు ఎగొట్టే పరిస్థితికి ఎలా దిగజారాడు అన్నవి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

విజయ్ మాల్యాను ప్రభుత్వం ఇండియాకు రప్పించగలదా…

విజయ్ మాల్యా కర్ణాటకకు చెందిన దక్షిణ కన్నడ అనే ప్రాంతంకి చెందినవాడు. తండ్రికి యూబి బివరేజెస్ కంపెనీ ఉండేది. అయితే విజయ్ మాల్యా 28 ఏళ్ల వయసులో ఉన్నపుడే తండ్రి మరణించడం వల్ల కంపెనీ బాధ్యతలను స్వీకరించాల్సి వచ్చింది. అలా బాధ్యతలు తీసుకున్న మాల్యా వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పటి వరకు ఉన్న స్పిరిట్ కంపెనీలలో ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ కి మాల్యా చేరుకున్నాడు. ఒకవైపు స్పిరిట్ కంపెనీ మరోవైపు ఎరువుల కంపెనీలు, రియల్ ఎస్టేట్ ఇలా 1998 సమయంలో టాప్ టెన్ బిలినియర్స్ లో ఒకడిగా ఎదిగాడు మాల్యా. ఇక మాల్యా తన 31 వయసులో ఎయిర్ హాస్టస్ ఐన సమీరా త్యాబ్జి ని పెళ్లి చేసుకున్నా ఏడాది లోనే విడిపోయారు, వీరికి సిద్ధార్థ మల్య జన్మించాడు. ఆపైన తన చిన్న నాటి స్నేహితురాలు రేఖను వివాహం చేసుకున్నారు. ఇక వారికి ఇద్దరు కుమార్తెలు కాగా మాల్యా మాజీ కింగ్ ఫిషర్ ఎయిర్ హాస్టస్ పింకీ లల్వని తో సహజీవనం చేస్తున్నారు. ఇక విజయ్ మాల్యా జీవితంలో చేసిన అతి పెద్ధ తప్పు ఎయిర్ లైన్ బిజినెస్ లోకి అడుగుపెట్టడం.

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లో మిగిలిన ఎయిర్ లైన్స్ కన్నా తక్కువ ధరకు ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో మంచి కంఫర్ట్స్ ఇస్తూ పేరు తెచ్చుకున్నా ప్రతి సంవత్సరం నష్టాలను చూసారు. అలా నష్టాలను చూస్తున్న సమయంలో డెక్కన్ ఎయిర్ లైన్స్ ను కొనుగోలి చేసి మరో పెద్ధ తప్పు చేసారు మాల్యా. అప్పులు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి, దీంతో బ్యాంకుల నుండి రుణాలను తెచ్చి మరీ రన్ చేసారు. అలా చివరికి 6000 కోట్ల అప్పులను చేసారు. వడ్డీలతో కలిపి 9000 కోట్లు కాగా ఇంకా కింగఫిషర్ ఎయిర్ లైన్స్ లోని ఉద్యోగస్థులకు ఇవ్వాల్సిన జీతాలు కలుపుకుంటే మొత్తంగా 10000 కోట్లు బకాయిలు ఉన్నాయి. అయితే విజయ్ మాల్యా డీజిల్ ధరలు తగ్గిస్తే ఎయిర్ లైన్స్ నడపగలమని అప్పటి ప్రభుత్వానికి లేఖలు రాసినా వారు పట్టించుకోలేదు. ఇక తాను చేసేదేమీ లేక లండన్ వెళ్ళిపోయాడు.

అయితే విజయ్ మాల్యా అప్పు ఎగ్గొట్టి లండన్ వెళ్ళలేదు. తాను అసలు ఇచ్చేందుకు సిద్ధమని వన్ టైం సెటిల్మెంట్ కు రావాలని బ్యాంకులకు చెప్పినా వడ్డీ కూడా కట్టాలని బ్యాంకులు పట్టుబట్టడంతో లండన్ చెక్కేసాడు. ఇక్కడ విజయ్ మాల్యాను తప్పు బట్టే చాలా మందికి బ్యాంకులు లక్ష రూపాయలు అప్పు ఇవ్వడానికి మన వద్ద లక్ష ప్రశ్నలు వేస్తారు కానీ ఒక బడా కంపెనీకి మాత్రం మొండి బకాయిలు ఉన్నా ఒకసారి ఇచ్చిన ఋణం తీర్చకపోతే మరో సారి ఋణం ఎలా ఇచ్చారు అన్నదే సందేహం. మొత్తంగా 17 బ్యాంకులు 6000 కోట్లు అప్పు ఇచ్చాయి. ఇక మాల్యా ఆదుకోమని ప్రభుత్వాన్ని అడిగినా పట్టించుకోలేదు. లండన్ వెళ్లిపోయిన మాల్యా ఇండియా నన్ను దొంగ గా చిత్రీకరించింది కానీ నేను ఇన్నేళ్ళల్లో ఎన్నో కోట్లు టాక్స్ కట్టుంటాను కానీ నన్ను ఆదుకోలేదు, ఇక బ్యాంకులకు అసలు కడతానని చెప్పినా వాళ్ళు సుముఖంగా లేరు అంటూ చెప్పారు. ఇక లండన్ చట్టాలు మాల్యాకు అనుకూలంగా ఉండటం వల్ల ఇప్పట్లో ఇండియా వచ్చేది లేదు అప్పు కట్టేది లేదు.