Vijaya Shanthi : ఆస్తులన్నీ పోయి చెన్నై వెళ్లిపోయాం… నా క్యారెక్టర్ ని బ్యాడ్ చేసారు… ఆరోజు ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళాను… బండి సంజయ్ కొడుకుపై ట్రోల్స్…: విజయ శాంతి

Vijaya Shanthi : సినిమాల్లో అగ్ర హీరోయిన్ గా అందరు హీరోలతో నటించి లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయ శాంతి సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తనకంటూ మంచి గుర్తింపు అందుకుంది. తెలంగాణ సెపరేట్ రాష్ట్రంగా అవతరించాలన్న ఆశయంతో తల్లి తెలంగాణ పార్టీ పెట్టి పోరాడారు. రాజకీయ ఓనమాలు బీజేపీ లో నేర్చుకున్నా ఆపైన సొంత పార్టీ పెట్టి పరిస్థుల ప్రభావం వల్ల పార్టీని తెరాసలో విలీనం చేసి అటు మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్లి చివరకు బీజేపీలో కొనసాగుతున్న రాములమ్మ తన రాజకీయ ప్రస్థానం గురించి ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఆ రోజు ఏడ్చుకుంటూ బయటికి వచ్చాను…

తెలంగాణ ప్రజల బానిస బ్రతుకు అలానే రజాకార్ల దౌర్జన్యం గురించి తన తల్లి వివరించేదంటూ విజయ శాంతి తెలిపారు. తన కుటుంబం కూడా రజాకార్ల దౌర్జన్యం భరించలేక ఆస్తులు వదిలి చెన్నై వలస వెళ్లి బ్రతికాకరంటూ చెప్పారు. తన తల్లి చెప్పిన విషయాలు విన్నాక తెలంగాణ కోసం పోరాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇక అలా 1998 లో రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి మొదట బీజేపీ లో చేరి తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాడారు. ఆ పైన తెలంగాణ గురించి మాట్లాడకూడదని అప్పటి బీజేపీ మిత్ర పక్షాల నుండి ఒత్తిడి రావడం వల్ల విజయం శాంతి పార్టీ నుండి బయటకు వచ్చి 2005 లో తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. ఆ సమయంలో చాలా ఏడ్చానని, బీజేపీకి రాజీనామా చేయడం చాలా బాధ కలిగించిందంటూ చెప్పారు. ఇక మారిన పరిస్థితుల్లో తెరాస లో పార్టీని విలీనం చేసాక కెసిఆర్ ఎలాంటి మోసగాడో అర్థమైందని నాకు రాజకీయ భవిష్యత్తు ఉండకూడదని చాలా ప్రయత్నించాడు అంటూ చెప్పారు.

మెదక్ ఎంపీ సీట్ నాకు ఇస్తానని చెప్పి తానే మళ్ళీ నామినేషన్ వేసాడు. మళ్ళీ నేను ఇండిపెండెంట్ గా వేయడంతో మళ్ళీ తాను విత్డ్రా చేసుకుని నాకు ఇచ్చాడు పార్టీ నుండి సీట్ అంటూ చెప్పారు. తన కొడుకు మొదటి సారి గెలవడానికి నేనే కస్టపడ్డాను అంటూ చెప్పారు రాములమ్మ. పార్టీ నుండి నన్ను పంపేయడానికి నా క్యారెక్టర్ ను కూడా బ్యాడ్ చేయాలని చూసారు. నేను తెలంగాణ ద్రోహిని అంటూ ప్రచారం చేయించాడు కెసిఆర్ అంటూ తన ముందు ఎవరైనా ఎదిగితే ఓర్వలేడు అంటూ చెప్పారు. ఇక బీజేపీ రాష్ట్రంలో ప్రస్తుతం పటిష్టంగా ఉందంటూ చెప్పిన రాములమ్మ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతారని క్లారిటీ ఇచ్చారు. ఇక బండి సంజయ్ కొడుకు మీద వచ్చిన ట్రోల్స్ గురించి మాట్లాడుతూ అవన్నీ తెరాస పని అంటూ ఆ అబ్బాయి తన కాలేజీలో ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేస్తే వాళ్ళను కొడుతుంటే ఆ విషయాన్ని వదిలేసి ఆ అబ్బాయిని బ్యాడ్ చేయాలని ఆ వీడియో ఎడిట్ చేసి వైరల్ చేసారు. అందులోనూ అది పాత వీడియో అంటూ తెరాస కుట్రలు ప్రజలు నమ్మరు అంటూ చెప్పారు విజయ శాంతి.