Movie News

Director Sagar: ప్రముఖ దర్శకుడు సాగర్ కన్నుమూత… విషాదంలో టాలివుడ్!

Director Sagar: టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు మరణించడంతో ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. తాజాగా సీనియర్ దర్శకుడు సాగర్ అనారోగ్య కారణంతో తుది శ్వాస విడిచాడు. ఈయన మరణంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సాగర్ ఇటీవల చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 6:03 నిమిషాలకు తుది శ్వాస విడిచారు.

ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన ఈయన మరణించడంతో పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. 1983లో విడుదలైన ” రాకాసిలోయ ” అనే సినిమాకి సాగర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నరేష్ విజయశాంతి జంటగా నటించారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ” అమ్మ దొంగా ” సినిమా ద్వారా ఆయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది.

ఇక ఆయన దర్శకత్వం వహించిన
” రామసక్కనోడు ” సినిమాకి మూడు నంది అవార్డులు వరించాయి. ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన విద్యా సాగర్ రెడ్డి గారు ఇండస్ట్రీలోని దర్శకుల సంఘానికి మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో దర్శకులుగా గుర్తింపు పొందిన శ్రీనువైట్ల, వివి వినాయక్ , రవికుమార్ వంటి ఎందరో దర్శకులు ఈయనకు శిష్యులు.

Director Sagar: సంతాపం తెలిపిన సెలబ్రిటీలు…

ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడిగా గుర్తింపు పొందిన విద్యాసాగర్ రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈరోజు ఉదయం ప్రాణాలు కోల్పోయారు. ఈయన మృతితో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. విద్యాసాగర్ రెడ్డి మృతి పట్ల ఆయన శిష్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. అలాగే పలువురు నటీనటులు కూడా సంతాపం తెలియజేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago