Vijayashanthi : విజయశాంతి మొదటి సినిమాలో బరువు పెరగడానికి ఇంజెక్షన్లు తీసుకుందట…!

Vijayashanthi : తమిళంలో మొదలు పెట్టి తెలుగులో కథానాయికగా ఎన్నో సూపర్ హిట్స్ అందుకుని ఇద్దరు అగ్రహీరోల హిట్ పెయిర్ గా నిలిచి మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా హిట్లందుకుని లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి మొదట చిల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇక చెన్నై లో పెరిగిన విజయశాంతి తొలుత తమిళంలో భారతి రాజ గారి సినిమాతో పరిచయమైంది. ఆ తరువాత తెలుగులో కృష్ణ గారి సినిమా ‘కిలాడి కృష్ణుడు’ లో హీరోయిన్గా చేసింది. తెలుగులో మొదటి సినిమా అదే. ఈ సినిమాకు విజయనిర్మల దర్శకత్వం వహించారు.

కృష్ణ గారి సినిమాకోసం బరువు పెరగడానికి…

కృష్ణ గారితో సినిమాకు విజయ నిర్మల గారు విజయశాంతి ని సెలెక్ట్ చేసినా అప్పటికి విజయశాంతి చాలా సన్నగా ఉండటం వల్ల ఆమె లావు అవ్వాలని ఆరు నెలల సమయంలో ఎలాగైనా తను కృష్ణ గారి పక్కన చక్కగా కనిపించాలని అక్కడ ప్రభుత్వ డాక్టర్ గా ఉన్న నరేషన్ అనే వైద్యుడికి చెప్పారట.

ఆయన మొదటి నుండి సినిమా వాళ్ళతో ఉన్న పరిచయాల కారణంగా విజయశాంతి ని లావు చేసే బాధ్యత తీసుకున్నారు. ఏడు వారాలకు వారానికి ఒక ఇంజెక్షన్ చొప్పున వేసి బరువు పెరిగేలా చేశారట. ఈ విషయం స్వయంగా ఆ డాక్టర్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అప్పట్లో ఈ విషయం అన్ని పత్రికలలోనూ హైలైట్ గా నిలిచింది.