Namrata: దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ మరణం ఘట్టమనేని ఫ్యామిలీని ఒక్కసారిగా శోకసంద్రంలోకి ముంచింది.ఒకే ఏడాదిలోనే ఈ ఫ్యామిలీకి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు మరణించడంతో వీరి కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక కృష్ణ గారు మరి నుంచి దాదాపు 15 రోజులు అయినప్పటికీ ఇంకా ఈ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా కృష్ణ మరణం నుంచి బయటపడలేకపోతున్నారు.
ఇక మహేష్ బాబు తన దుఃఖానికి దిగు మింగుకొని తన తండ్రికి నిర్వర్తించాల్సిన కార్యక్రమాలన్నింటిని కూడా పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు ఫ్యామిలీ గురించి చాలామందికి తెలియదు. అయితే కృష్ణ చిన్న కర్మ రోజున మహేష్ బాబుతో కలిసి రమేష్ బాబు భార్య పిల్లలు ఫోటోలు దిగడంతో ఒకసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఇకపోతే రమేష్ బాబు భార్య మృదుల అలాగే కూతురు భారతి కుమారుడు జయకృష్ణ ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇకపోతే తాజాగా మహేష్ బాబు భార్య నమ్రత రమేష్ బాబు కుమార్తె భారతి అలాగే సితారతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మొదటిసారి భారతి గురించి పోస్ట్ చేశారు.
చాలా రోజుల తర్వాత ఈ ఇద్దరమ్మాయిల వల్ల ఇంట్లో నవ్వులొచ్చాయి. అంటూ భారతి, సితారతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మొదటిసారి తన బావ కుమార్తెతో కలిసి దిగిన ఫోటోని నమ్రత షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన మహేష్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ ఫోటో పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…