Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజు గురించి అందరికీ సుపరిచితమే. ఈయన ఒకానొక సమయంలో డిస్ట్రిబ్యూటర్ గా పని చేస్తూ చిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అనంతరం భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించడమే కాకుండా ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు.
ఇకపోతే నిర్మాతగా కెరియర్ లో ఎంతో సక్సెస్ అయినటువంటి దిల్ రాజు వ్యక్తిగత జీవితానికి వస్తే ముందుగా ఈయన అనిత అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉన్నారు. తన కుమార్తె హన్షిత వివాహాన్ని కూడా ఎంతో అంగరంగ వైభవంగా చేశారు. ఇలా వీరి వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ 2017 వ సంవత్సరంలో అనిత ఉన్నఫలంగా గుండెపోటుతో మరణించారు.
ఈ క్రమంలోనే రెండు సంవత్సరాలు పాటు ఒంటరిగా గడిపినటువంటి దిల్ రాజుకు తన కుటుంబ సభ్యులు రెండవ వివాహం చేశారు. ప్రస్తుతం ఈయన తన రెండవ భార్యతో కలిసి ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి దిల్ రాజు తాను రెండో పెళ్లి చేసుకోవడానికి గల కారణాలను వెల్లడించారు. అనిత మరణించిన తర్వాత తాను మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయ్యానని తెలిపారు.
అనిత మరణ వార్త నుంచి బయటపడటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఇకపోతే నాకు ఉన్న ఒకే ఒక వ్యాపకం గ్యాంబ్లింగ్.ఇలాగే ఉంటే తన ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుందని భావించిన తన కుటుంబ సభ్యులు రెండవ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారు. ఆ సమయంలో తన కూతురు అల్లుడు కూడా తన వద్ద ఉన్నారని, రెండో పెళ్లి విషయంలో తన కుమార్తె సపోర్ట్ కూడా ఉండడంతో తాను రెండవ పెళ్లి చేసుకున్నానని తెలిపారు.ఇలా తేజస్విని అనే అమ్మాయిని వివాహం చేసుకున్న దిల్ రాజు దంపతులకు కూడా ఒక కుమారుడు జన్మించారు. ఇక తనకు తన ఇద్దరి భార్యల పేర్లు కలిసి వచ్చేలా అన్వయ్ రెడ్డి అని నామకరణం చేశారు.ఈ క్రమంలోనే రెండవ పెళ్లి గురించి దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…