బోర్ వేస్తే నీళ్లు కాదు.. పెట్రోల్ వస్తోంది.. ఎక్కడో తెలుసా..?

దుబాయ్, సౌదీ, ఒమన్ లాంటి గల్ఫ్ దేశాల్లో బోర్ వేస్తే నీటికి బదులు పెట్రోల్, చమురు ఉబికి వస్తుంది. అక్కడ ఎక్కువగా చమురు నిక్షేపాలు ఉండడంతో పెట్రోల్ ను బోర్లతో తవ్వితీసి అమ్ముకుంటున్నారు. కానీ వ్యవసాయమే ఆధారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో బోర్ వేస్తే నీళ్లు రావడం లేదు.. ఏకంగా వాటి బదులు పెట్రోల్ వస్తోంది. ఈ విచిత్రం చూసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ నగర నడిబొడ్డున గోపాలపట్నం రామకృష్ణనగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ బోర్ వేయగా వాటర్ తో పాటు పెట్రోల్ కలుస్తోంది. దీంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. సొంత బోర్లు వేసినప్పటికీ అందులోంచి పెట్రోల్ వాటర్ తో పాటు పెట్రోల్ వస్తోంది. దీంతో మున్సిపల్ సరఫరా చేసే నీరే వీరికి దిక్కవుతోంది. ఇక్కడి పక్కనే ఉండే భారత్ పెట్రోల్ బంక్ వల్ల ఈ సమస్య ఉత్పన్నం అవుతోందని కాలనీ వాసులు అంటున్నారు.

దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆర్కేనగర్ వాసులు వాపోతున్నారు. విశాఖపట్నం 91వ వార్డు రామకృష్ణనగర్ తోపాటు పక్క ప్రాంతాలు కూడా ఇలాంటి నీటితోనే ప్రజలు చాలా ఇబ్బందుకు గురవుతున్నారు. ఈ ప్రాంత వాసులకే ఈ సమస్య ఉత్పన్న అవుంతోంది. బోర్ నుంచి వచ్చే నీళ్లలో పెట్రోల్ కలుషితం అవుతోందని కాలనీవాసులు అంటున్నారు. భారత్ పెట్రోల్ బంక్ ట్యాంకు పగిలి అందులోంచి పెట్రోల్, డీజీల్ నాలుగేళ్ల క్రితం భూగర్భంలోకి లీక్ అయ్యింది.

గ్రౌండ్ లెవల్ మొత్తం కలుషితమైంది. దీంతో దీని పక్కన ఉన్న కాలనీలో ఏ ప్రాంతంలో బోర్ వేసినా నీళ్లలో పెట్రోల్ వస్తోంది. దీంతో ఆ నీటికి కాలనీ వాసులు వాడలేక పోతున్నారు. ఇక మున్సిపల్ సరఫరా చేసే నీరు సరిపోవడం లేదని.. ఇక్కడ బోర్ నీళ్లు వాడక ఇబ్బందులు పడుతున్నారు . దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.