బరువు తగ్గాలనుకుంటున్నారా.. రాత్రి 7 తర్వాత ఈ పనులు అస్సలు చేయకండి?

ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహారానికి తగ్గట్టుగా శారీరక శ్రమ చేయకపోవటం వల్ల మన శరీర బరువు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలోనే అధిక శరీర బరువు ఊబకాయానికి దారి తీయడమే కాకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తడానికి కారణం అవుతుంది.ఈ క్రమంలోనే చాలా మంది వారి శరీర బరువును తగ్గించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కఠిన ఆహార నియమాలను పాటించడం, అధిక శారీరక వ్యాయామాలు చేయడం వంటివి చేస్తుంటారు.అయితే ఈ విధంగా శరీర బరువు తగ్గాలనుకొనే వారు ఈ రాత్రి ఏడు గంటల తర్వాత ఈ పనులను చేయడం మానేస్తే తొందరగా శరీర బరువు తగ్గించుకోవచ్చు చెబుతున్నారు. మరి ఆ పని ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

సాయంత్రం ఏడు గంటల తరువాత మనం తీసుకునే ఆహారం మన శరీరానికి శక్తిని ప్రసారం చేయదు. కనుక 7 గంటలలోపు తగినంత ఆహారాన్ని తీసుకోవాలి. ఏడు గంటల తరువాత తిన్న ఆహారం మన శరీరంలో కొవ్వుగా పేరుకుపోవడం వల్ల శరీర బరువు పెరుగుతారు.రాత్రి సమయంలో భోజనం చేసేటప్పుడు ఎక్కువగా కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు, పిండిపదార్ధాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎక్కువగా పండ్లను మాత్రమే తీసుకోవాలి.

చాలామందికి రాత్రి పడుకునే ముందు కూడా కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. వీలైనంత వరకు ఈ అలవాటును మార్చుకోవాలి. అలాగే రాత్రి పడుకునే ముందు శారీరక వ్యాయామాలు చేయకూడదు. ఇలా చేయటం వల్ల మన జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపే పరిస్థితి ఉంటుంది.

ప్రతి రోజూ ఎక్కువ మొత్తంలో నీరు తాగడం ఎంతో ఆరోగ్యకరం.అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు అధిక మొత్తంలో నీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు కానీ, రాత్రి పడుకునే ముందు అధిక మొత్తంలో నీటిని తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అధిక మొత్తంలో నీటిని తీసుకున్న మనం తిన్న ఆహారం జీర్ణం కాక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మన ఆరోగ్యం మన నిద్రపై ఆధారపడి ఉంటుంది. రోజుకు ఆరు నుంచి ఏడు గంటల పాటు నిద్ర పోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చు. రాత్రి ఏడు గంటల తర్వాత పై తెలిపిన పనులను చేయడం మానేస్తే శరీర బరువును సులభంగా తగ్గవచ్చు.