wcr-apprentice-recruitment-2021-for-716-posts-at-indianrailways

పదో తరగతితో రైల్వేలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

పశ్చిమ మధ్య రైల్వే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 716 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే రైల్వే ఉద్యోగాల భర్తీ కొరకు పలు నోటిఫికేషన్లు విడుదల కాగా తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. పదో తరగతితో పాటు ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://wcr.indianrailways.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

మొత్తం 716 ఉద్యోగ ఖాళీలలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగ ఖాళీలు 135, ఫిట్టర్ ఉద్యోగ ఖాళీలు 102, వెల్డర్ (ఎలక్ట్రిక్ & గ్యాస్) ఉద్యోగ ఖాళీలు 43, పెయింటర్ (జనరల్) ఉద్యోగ ఖాళీలు 75, మెసన్ ఉద్యోగ ఖాళీలు 61, కార్పెంటర్ ఉద్యోగ ఖాళీలు 73, ప్లంబర్ 58, బ్లాక్ స్మిత్ ఉద్యోగ ఖాళీలు 63, వైర్ మెన్ 50, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 10, మెషినిస్ట్ 5, టర్నర్ 2, ల్యాబ్ అసిస్టెంట్ 2, క్రేన్ అసిస్టెంట్ 2, డ్రాఫ్ట్స్ మేన్ ఉద్యోగ ఖాళీలు 5 ఉన్నాయి.

2021 సంవత్సరం ఏప్రిల్‌ 1 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉంది. ఏప్రిల్ 30వ తేదీ లోపు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా నోటిఫికేషన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

పదో తరగతి, ఐటీఐ అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభిస్తుంది.