పాత ఫర్నిచర్ ను మార్చాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి!

మీ ఇంట్లో ఉపయోగించే ఫర్నిచర్ చాలా పాతగా అయిపోయిందా? కొత్త ఫర్నిచర్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే. ఫర్నిచర్​ అమ్మకాల్లో ప్రపంచ దిగ్గజంగా కొనసాగుతున్న స్వీడన్​ కంపెనీ.. ఐకియా 2030 నాటికి “క్లైమేట్ పాజిటివ్” గా మారడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా ఫర్నిచర్​ బైబ్యాక్, రీసేల్​ స్కీమ్​లను ప్రారంభించింది.

పర్యావరణంలో వ్యర్థ పదార్థాలను తగ్గించి, పర్యావరణాన్ని కాపాడటం కోసమే ఐకియా ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఐకియాలో కొనుగోలు చేసిన ఫర్నిచర్ కొంతకాలం పాటు ఉపయోగించి తరువాత ఫర్నిచర్ మార్చాలనుకునే వారు పాత ఫర్నిచర్ ను తిరిగి ఐకియా స్టోర్ రూములో రిటన్ చేయవచ్చు.దీనికి గాను వారికి బైబ్యాక్​ వోచర్లు ఇస్తారు.

వోచర్లను వినియోగించి ఇతర వస్తువులను డిస్కౌంట్​లో కొనుగోలు చేయవచ్చు. అయితే కస్టమర్లు రిటర్న్ చేసే వస్తువులు మెరుగైన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే 50% కొనుగోలు చేస్తామని, ఆ వస్తువుల పై ఏవైనా గీతలు, స్క్రాచెస్ ఉన్నప్పుడు 40 శాతానికి కొనుగోలు చేస్తామని, బాగా స్క్రాచెస్ ఏర్పడిన ఫర్నిచర్ ను 30 శాతానికి కొనుగోలు చేస్తామని ఐకియా తెలిపింది.

ఈ విధంగా ఐకియా తీసుకున్న ఎక్స్చేంజ్, రిటర్న్, ఫర్నిచర్ పాలసీని ముందుగా బ్రిటన్ లో అనేక నగరాల్లో ఈ పథకాలను అమలు చేసిన తర్వాత దీన్ని ఇక్కడ ప్రారంభించాలని ఐకియా నిర్ణయించుకుంది.