గర్భవతులు కాఫీ తాగకూడదా… తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?

ఉదయాన్నే వేడి వేడి కాఫీ తాగడం అనేది సర్వసాధారణమైన ప్రక్రియ. కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదే. అయితే కాఫీ తాగే విషయంలో కొన్ని నియమాలు పాటించకపోతే తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. కాఫీ గింజల్లో కెఫిన్ అనే ఆల్కలాయిడ్ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజు కెఫీన్ తగు మోతాదులో తీసుకుంటే అలసటను తొలగి నరాలను ఉత్తేజపరిచి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. మోతాదుకు మించి తీసుకుంటే రక్త ప్రసరణ వ్యవస్థ మందగించి గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ వంటి వ్యాధులతో బాధ పడాల్సి వస్తుంది.

కావున రోజుకు రెండు కప్పుల కాఫీ తాగితే ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. డయాబెటిస్, గుండె జబ్బులు, నరాలకు సంబంధించిన వ్యాధులుతో బాధపడేవారు అసలు కాఫీ తాగాక పోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.కాఫీ ఎక్కువగా తాగేవారిలో ఎదురయ్యే సమస్యల గురించి తెలుసుకుందాం. దీర్ఘకాలం పాటు షుగర్ వ్యాధితో బాధపడేవారు కాఫీని తాగడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. మరియు రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరిగి రక్త ప్రసరణ వ్యవస్థ సమతుల్యత కోల్పోతుంది.కాఫీని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో కార్టిసోల్ హార్మోన్‌పై అధిక ప్రభావం పడుతుంది. ఇది ఒత్తిడిని మరింత ఎక్కువ చేస్తుంది. దాంతో రక్తప్రసరణ పై ఒత్తిడి పెరిగి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కాఫీ తాగడం మంచిది కాదు. కాఫీలో ఉండే కెఫిన్ శాతం మీ శరీరంలోని రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల కడుపులో పెరుగుతున్న పిండానికి రక్తం సరఫరాలో అసమతుల్యత ఏర్పడి పిండం ఎదుగుదలలో అవరోధం ఏర్పడుతుంది అని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రమాదకర రక్తపోటుతో బాధ పడేవారు కాఫీ ని ఎక్కువగా తాగడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ నియంత్రణ కోల్పోయి నరాలపై ఒత్తిడి పెరిగి గుండె పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

ఎవరైతే తీవ్రమైన తలనొప్పి లేదా మైగ్రేన్ సమస్యతో బాధపడుతుంటే కాఫీని తాకక పోవడమే మంచిది. ఈ సమస్యతో బాధపడేవారు కాఫీని తాగడం వల్ల కాఫీలో ఉన్నటువంటి కెఫిన్ ఆల్కలాయిడ్ మెదడు సంబంధిత నరాల పై తీవ్ర ప్రభావం చూపి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి కాఫీ అయినా, మరి ఏ ఇతర ఆహార పదార్థాల నైనా మోతాదుకు మించి తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.