వాట్సాప్ కొత్త ఫీచర్.. 24 గంటల్లో ఆటోమేటిక్ డిలీట్!

వాట్సాప్ ప్రైవసీని మెరుగుపరచడం కోసం ఎప్పటికప్పుడు వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. ఇదివరకే వాట్సాప్ డిజప్పియరింగ్ మెసేజెస్ అనే ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మనం చేసిన మెసేజ్ లు వారం తరువాత వాటంతట అవే డిలీట్ అవుతాయి. అయితే తాజాగా ఈ ఫీచర్ ద్వారా ఈ మెసేజ్ లు కేవలం 24 గంటలు తగ్గించేందుకు వాట్సాప్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

WABetaInfo కథనం ప్రకారం వాట్స్అప్ 24 గంటల్లో డిలీట్ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత వారం రోజుల ఆప్షన్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది.ఈ రెండు ఆప్షన్లలో మనకు నచ్చిన దానిని మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల మెసేజ్ లు ఆటోమేటిక్ గా సరైన సమయానికి డిలీట్ అవుతాయి.

ఒకవేళ మీ మెసేజ్ లు 24 గంటల్లో డిలీట్ కావాలని కోరుకుంటే 24 గంటల ఆప్షన్ పెట్టుకోవడం వల్ల మెసేజెస్ 24 గంటల్లో డిలీట్ అవుతాయి. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్షల దశలో ఉంది .త్వరలోనే ఈ ఫీచర్ ని ఐవోఎస్, ఆండ్రాయిడ్, డెస్క్ టాప్, వెబ్‌లకు దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ అవకాశం స్నాప్ చాట్ లో అందుబాటులో ఉంది.

వాట్సాప్ వినియోగదారులు భవిష్యత్తులో తమ చాట్ లను ఐవోఎస్, ఆండ్రాయిడ్‌ల మధ్య కూడా మార్చుకునేలా కొత్త ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.మల్టీ డివైస్ సపోర్ట్ ద్వారా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ చర్యద్వారా కొత్త ఫోన్ కొన్నప్పుడు వినియోగదారులకు చాట్ బ్యాకప్ విషయంలో ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం ఉండదు.