టాలీవుడ్ లో వెళ్ళిపోమాకే అనే సినిమా ద్వారా వెండితెరకు తెరకు పరిచయం అయ్యాడు హీరో విశ్వక్ సేన్… ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమాతో విశ్వక్ సేన్ ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత దర్శకుడిగా మరి ఫలక్ నమదాస్ అనే సినిమాని తెరకెక్కించాడు. దర్శకుడిగా తొలి హిట్టును అందుకున్నారు. ఆ తర్వాత గత సంవత్సరంలో ‘హిట్’ అనే సినిమాతో మరోసారి హీరోగా వచ్చి హిట్ ను అందుకున్నారు.
ప్రస్తుతం విశ్వక్ సేన్ పాగల్ అనే సినిమాతో బిజీగా ఉన్నారు.తాజాగా నెటిజన్స్ తో మాట్లాడిన విశ్వక్ సేన్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చారు. అందులో భాగంగా కరోనా గురించి చెప్పాలని అడగగా చాలా భయంకరంగా ఉందని అందరి సోషల్ డిస్టెన్స్ పాటించాలని,మాస్కులు ధరించాలని తెలిపారు. ఇక ఒక నెటిజన్ క్రష్ గురించి ప్రశ్నించగా దానికి విశ్వక్ సేన్ ఒకప్పుడు తెలుగులో హీరోయిన్ గా రాణించిన ఇలియానా తన క్రష్ అని చెప్పారు.
అయితే కరోనా వల్ల సినిమా ట్రైలర్ ఆలస్యం కానుందని ఈ సందర్బంగా నెటిజన్స్ కు తెలిపాడు. అయితే అభిమానులతో ముచ్చటించిన విశ్వక్ సేన్ పెళ్లి గురించి కూడా ప్రశ్నలు వచ్చాయి. అయితే ఈ ప్రశ్నకి బదులుగా తానూ పెళ్ళికి సిద్ధమని ఏమైనా సంబంధాలు ఉంటె చెప్పండంటూ వారికే తిరిగి ప్రశ్న వేయడం విశేషం. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చిన ఈ సంభాషణ అంత ఫన్నీ ఫన్నీగా సాగింది.
హీరో విశ్వక్ సేన్ పాగల్ సినిమా తర్వాత మరో రెండు సినిమా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకుంది.. అయితే గత ఏడాది విశ్వక్ సేన్ నటించిన హిట్ సినిమా రాగా దానికి కొనసాగింపుగా ‘హిట్ 2 ‘ సినిమా ఉండబోతుందని దర్శకుడు తెలిపాడు. దానికి తగ్గుట్టు గానే హిట్ 2 సినిమాని అడివి శేష్ హీరోగా పెట్టి దర్శకుడు శైలేష్ కొలను తీయబోతున్నారు..!!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…