కరోనా సెకండ్ వేవ్ వచ్చి మరోసారి సినిమా ఇండస్ట్రీని కోలుకోకుండా చేస్తోంది.తాజాగా కరోనా ఎఫెక్ట్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ మూవీపై కూడా పడింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు..చిరూ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది..
ప్రస్తుతం ఆచార్య మూవీ షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ను నిరవధికంగా వాయిదా వేసినట్టు సమాచారం.. దేవాదాయ శాఖలోని అక్రమాలపై సంధించిన ఈ సినిమా విడుదల కరోనా కల్లోలంతో బ్రేక్ పడింది.కరోనా సెకండ్ వేవ్ దేశంలో రావడం.. వేల కేసులు నమోదవుతున్న దృష్ట్యా ప్రభుత్వాలు మళ్లీ ఆంక్షలు విధించాయి.
దీంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది.మొదటి ‘ఆచార్య’ మూవీని మే 14న రిలీజ్ చేయాలని చిత్రం యూనిట్ ప్రకటించింది. అయితే ఈ మధ్య కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. విలన్ గా నటిస్తున్న సోనూ సూద్ సైతం కరోనా బారినపడ్డారు. దీంతో సినిమా షూటింగ్ వాయిదా వేశారు.తాజాగా ఈ సినిమాను చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జూలై మధ్యలోనే విడుదల చేస్తారని కూడా తెలుస్తోంది.
మొత్తం మీద ఆచార్య మూవీ విడుదల కరోనా వేవ్ తగ్గడం మీదనే ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.కొణిదెల ప్రొడక్షన్.. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లలో నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను మేలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసినా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు..అందుకే ఏకంగా ఈ సినిమాను ఆగస్టు నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట మేకర్స్..ఈఇక ఈ సినిమా తర్వాత మలయాళ మూవీ లూసిఫార్ రిమేక్ లో నటించనున్నాడు చిరు.. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ రిమేక్ ని డైరెక్ట్ చేయనున్నాడు…!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…