పాట‌లో రాజ్య‌ల‌క్ష్మిని కౌగిలించుకోడానికి సురేష్ ఎన్ని టేక్ లు తీసుకున్నాడో తెలుసా..!

శోభ‌న్‌బాబు హీరోగా న‌టించిన ‘జ‌గ‌మొండి’ సినిమాలో సురేష్ మొదటి సారిగా నటించారు. ఇందులో అతడు సెకండ్ హీరోగా నటించారు. ఈ చిత్రం స‌మ‌తా ఆర్ట్స్ రూపొందించారు. ఇక్కడ సురేష్ కు జోడీగా ‘శంక‌రాభ‌ర‌ణం’ రాజ్య‌ల‌క్ష్మి నటించారు. ఓ పాటను వీళ్లద్దరి మద్య ఊటీలో చిత్రీకరించారు. ఆ పాటలోనే సురేష్ మొదటిసారి కెమెరా ముందు నిల్చున్నారు. అంతకముందు అతడికి నటనలో గానీ, నాట్యంలో గానీ ఎలాంటి అనుభవం కూడా లేదు.

అప్పటికే రాజ్యలక్ష్మి శంకరాభరణం చిత్రం ద్వారా ఎంతో పాపులర్ అయ్యారు. త‌న‌కంటే సీనియ‌ర్ న‌టితో క‌లిసి పాట‌పాడుతూ, డాన్స్ చెయ్య‌డం అన‌గానే మొద‌ట్లో సురేష్ కు కొంచెం జంకు క‌లిగింది. వీరిద్దరి మధ్య జరిగే మొదటి దృశ్యంలో సురేష్ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చి రాజ్య‌ల‌క్ష్మిని కౌగిలించుకోవాలి. అయితే దర్శకుడు మధుసూదనరావు చిత్రీకరణ కంటే ముందే రిహాసల్స్ చేయించారు.

రాజ్యలక్ష్మిని అతడు రిహాసల్స్ సమయంలో కూడా కౌగిలించుకోకుండానే మూవ్‌మెంట్స్ చూసుకొని మ‌ధుసూద‌న‌రావు ‘టేక్’ అన్నారు. తర్వాత సౌండ్ స్టార్ట్ అయింది. పాట మొదలైంది.. పురుగెత్తుకుంటూ వెళ్లి అతడు రాజ్యలక్ష్మిని కౌగిలించుకోవాలి. పెదాలు కదుపుతూ ప‌రుగెత్తుకుంటూ వెళ్లి రాజ్య‌ల‌క్ష్మిని కౌగిలించుకోబోయే ముందు ఆగిపోయాడు సురేష్.

ఏమైంది.. కౌగిలించుకోకుండా ఆగిపోయావు ఏంటి.. అంటూ డైరెక్టర్ ప్రశ్నించారు. కెమెరామేన్‌, డైరెక్ట‌ర్‌, ఇత‌ర యూనిట్ మెంబ‌ర్స్ ముందు ఒక అమ్మాయిని కౌగిలించుకోవ‌డం అనేస‌రికి సురేష్ కు ఏదోలా అనిపించింది. సరే మళ్లీ మరో టేక్ అన్నట్లు చెప్పాడు.. ఇబ్బంది పడుకుంటూనే.. ఇలా ఒక‌టి.. రెండు.. మూడు.. నాలుగు.. అయిదు.. ఆరు.. ఏడు.. ఇలా టేకులు తీశారు. డైరెక్టర్ అతడిని దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పి ఎనిమిదో టేక్ లో ఓకె చేశారని ఓ సందర్భంలో సురేష్ తెలియజేశారు.