పిల్లలు మాస్క్ ఏ విధంగా ధరించాలో తెలుసా?

కరోనా రెండవ దేశవ్యాప్తంగా తీవ్ర రూపం దాల్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది యువకులు ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలోనే కరోనా మూడవ దశ చిన్న పిల్లలపై అధిక ప్రభావం చూపుతుందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే చిన్నారుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి మన వద్ద ఉన్న ఏకైక అస్త్రం మాస్క్ అని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే కరోనా నుంచి చిన్నపిల్లలను కాపాడుకోవడం కోసం వారికి మాస్క్ వాడటం మంచిదేనా? లేదా? అనే అయోమయంలో ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు. అయితే చిన్న పిల్లలకు మాస్క్ ఏ విధంగా ధరించాలి అనే విషయాల గురించి కేంద్ర ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలను జారీచేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (DGHS) ప్రకారం..

ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగిన పిల్లలు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు.6 -11 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలు వారు మాస్క్ లను ధరించే సామర్థ్యాన్ని బట్టి మాస్క్ లు వేయాలి.12-17 సంవత్సరాల వయసు కలిగిన వారు పెద్ద వారి మాదిరిగానే యధావిధిగా మాస్క్ ధరించాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు తెలిపింది. ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఎవరికైనా అనారోగ్యం చేసిన వారి దగ్గరికి వెళ్తున్న సమయంలో తప్పనిసరిగా మాస్క్ వేయాలని తెలిపారు.

చిన్నపిల్లలు మాస్క్ లను వాడే ముందు తప్పనిసరిగా చేతులను సబ్బుతో శుభ్రంగా కడగడం లేదా శానిటైజర్ వాడటం చేయాలి. ఈ క్రమంలోనే అమెరికా వ్యాధుల నియంత్రణ కేంద్రం 2 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు తప్ప మిగిలిన వారందరూ తప్పకుండా మాస్కు ధరించాలని తెలిపింది.అదేవిధంగా చిన్నపిల్లలు covid బారిన పడితే వారికి ఏ విధమైనటువంటి చికిత్సను అందించాలనే విషయాలను కూడా డీజీహెచ్‌ఎస్‌ తాజా మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది. కోవిడ్ బారిన పడిన వారికి అత్యవసర పరిస్థితులలో ఉపయోగించే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను పిల్లలకు అసలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే పిల్లలు కూడా భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలను పాటించాలని డీజీహెచ్‌ఎస్‌ తన మార్గదర్శకాల్లో పేర్కొంది.