ఆరేళ్లుగా ఇంట్లోనే ఉంటున్న మహిళ.. షాకింగ్ కారణం?

ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర పరిస్థితులలో లాక్ డౌన్ విధించి ఇంటికి పరిమితం కావాలంటే.. అమ్మో మరి లాక్ డౌన్ ఆ అంటూ హడలిపోతున్నారు . కానీ ఓ మహిళ మాత్రం ఏకంగా ఆరు సంవత్సరాల నుంచి లాక్ డౌన్ పాటిస్తోంది. అదేంటి ఆరు సంవత్సరాల క్రితమే ఆమెకు కరోనా వస్తుందని తెలుసా? అనే అనుమానం మీకు రావచ్చు. అయితే కరోనా వస్తుందని కాదండోయ్.. ఆమెకు అతి భయంకరమైన ‘ఎమెటోఫోబియా’ ఉంది. అంటే.. వాంతుల భయం.

సాధారణంగా మనం బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా వాంతి చేసుకుంటున్నట్లు తెలిసినా, చూసిన మనకి కూడా వాంతి కలగడం జరుగుతుంది. కానీ 35 ఏళ్ల ఎమ్మా డావిస్‌‌కు మాత్రం ఇది తీవ్రస్థాయిలో ఉంది. ఆ ఫొబియానే గత ఆరు సంవత్సరాల నుంచి ఆమెను ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండా చేస్తోంది.

ఈమెకు ఇద్దరు పిల్లలు ఉండగా గత ఆరు సంవత్సరాల నుంచి ఒక్క సారి కూడా తన పిల్లలతో కలిసి బయటకు వెళ్లింది లేదు.తన ఇద్దరు పిల్లలను తన భర్త వెంట తీసుకొని బయటకు వెళ్లే వారు.12 ఏళ్ల నుంచి ఎమ్మాలో ఈ ఫొబియా ఎక్కువగా ఉండడంతో నిత్యం వాంతులు చేసుకుంటూ కుప్పకూలిపోయోది. ఈ సందర్భంగా ఎమ్మా మాట్లాడుతూ “తాను ఉద్యోగం చేస్తున్నప్పుడు బస్సులో ప్రయాణించిన ఎక్కడికి వెళ్ళిన ఎంతో భయాందోళనకు గురు అయ్యేదని, రోజులో ఆరు సార్లు వాంతులు చేసుకుని కుప్పకూలి పోయేదాన్ని, అందుకే బయటకు వెళ్లాలంటే భయం వేయడంతో ఆరు సంవత్సరాల నుంచి ఇంటికే పరిమితం అయ్యాయని తెలిపారు.

అయితే ఈమెకు ఉన్న ఈ పరిస్థితులలో అధిక డిప్రెషన్ కి గురయ్యానని పేర్కొంది. ఈ ఫోబియా నుంచి బయటకు రావడం కోసం ఆమె నిత్యం వివిధ రకాల థెరపీలు, సైకోథెరపీలు ప్రయత్నించినా ఆ ఫోబియా నుంచి బయటపడలేక పోవడంతో ఆరు సంవత్సరాల నుంచి ఇంటికి పరిమితమైనట్లు తెలిపారు.