Categories: FeaturedMovie News

ఆ డైరెక్టర్ మామూలోడు కాదంటున్న సింగర్ సునీత!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ సింగర్ గా ఎన్నో వందల పాటలు పాడి ఎంతో మంది మనసును దోచుకున్న వారిలో సింగర్ సునీత ఒకరు. ఈమె గాత్రంతో పాడే పాటలు ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా సునీత రామ్ ను రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఈ క్రమంలోనే సునీత తన జీవితంలో జరిగినటువంటి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తన ఓ సినిమాకి డబ్బింగ్ చెబుతున్న సమయంలో ఆ సినిమా డైరెక్టర్ తనతో వ్యవహరించిన తీరు గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా డబ్బింగ్ చెప్పే సమయంలో మొదటి రోజు స్టూడియోలో అడుగు పెట్టగానే దర్శకుడు హలో మేడం అంటూ పలకరించి తను నా అభిమాని అంటూ పరిచయం చేసుకున్నారు.

ఈ విధంగా డబ్బింగ్ చెబుతున్న సమయంలో కొంత సమయానికి ఆ దర్శకుడు నన్ను సునీత అని పిలవడం మొదలు పెట్టాడు. ఈ విధంగా ఈ సినిమా డబ్బింగ్ కొన్ని సెషన్స్‌ పూర్తి అయిన తర్వాత ఆ దర్శకుడు నాకు మధ్య మధ్యలో సలహాలిస్తూ అరే బుజ్జి ,నాన్న అని పిలవడం మొదలుపెట్టారు. ఈ విధంగా దర్శకుడు నన్ను అలా కలవడం ఎంతో చిరాగ్గా అనిపించిందని సునీత తాజాగా తెలియజేశారు.

అయితే నా అదృష్టం ఏమిటంటే ఇప్పటివరకు ఆ దర్శకుడిని కలిసే అవకాశం మరోసారి రాలేదని ఆమె తెలిపారు.అప్పుడు ఆ డైరెక్టర్ తనతో ఆ విధంగా ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగించిన ఇప్పుడు నవ్వొస్తుంది అంటూ ఆమె తెలిపారు. అయితే సింగర్ సునీతతో ఆ విధంగా ప్రవర్తించడం డైరెక్టర్ ఎవరు? తన డబ్బింగ్ చెప్పిన ఆ సినిమా ఏమిటి? అనే విషయాల గురించి ఎక్కడ చెప్పకపోవడం ఆశ్చర్యం. ప్రస్తుతం సునీత డ్రామా జూనియర్స్ అనే కొత్త షో కి న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago