మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ఇవి పాటించాల్సిందే..!

సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువ అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. మగవారి కన్నా ఆడవారిలో ఎక్కువగా కీళ్లనొప్పుల సమస్యలు, ముఖ్యంగా నెలసరి సమస్యలు మహిళలను వెంటాడుతుంటాయి. ఈ సమస్యల వల్ల వారు ఎంతో సతమతమవుతుంటారు. ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలగాలంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే మహిళల ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం.

మహిళలలో ఎక్కువగా నెలసరి సమస్య వచ్చినప్పుడు అధికంగా కడుపు నొప్పిని కలుగజేస్తుంది.ఈ విధంగా బహిష్టు సమయంలో నొప్పి కలగడానికి గల కారణం హార్మోన్ల అసమతుల్యత అని చెప్పవచ్చు. ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే మహిళలు తీసుకునే ఆహారంలో మొదటి ముద్ద నువ్వుల పొడితో కలిపి తీసుకోవటం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి బహిష్టు సమయంలో నొప్పిని కలిగించకుండా ఉంటుంది. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం జరగడం వల్ల రక్తహీనత సమస్యలు తలెత్తుతుంటాయి.ఈ విధంగా అధిక రక్తస్రావంతో బాధపడే వారు వీలైనంత వరకు ఐరన్ పుష్కలంగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

రాత్రి పడుకునే సమయంలో అరగ్లాసు గోరువెచ్చని పాలలో టేబుల్ టీస్పూన్ పటిక బెల్లం చూర్ణం కలుపుకొని తాగడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. వారానికి రెండు సార్లైనా మెంతికూరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల నెలసరి క్రమంగా వస్తుంది. నిమ్మరసం తాగడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా తులసి ఆకుల టీని తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చు. అన్నం తక్కువగా తీసుకుని ఆకుకూరలను,కూరగాయలను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైనన్ని పోషకాలు అందుతాయి. ఈ విధమైన ఈ చిట్కాలను పాటించడం వల్ల మహిళలు ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు