Writer And Director BVS Ravi : కొరటాల రాస్తానంటే నేనెందుకు అడ్డుపడతాను… గోపీచంద్ బలుపును బూతు అనుకున్నాడు…: రైటర్ మరియు డైరెక్టర్ బివిఎస్ రవి

Writer And Director BVS Ravi : రైటర్ గాను అటు డైరెక్టర్ గాను మంచి గుర్తింపు అందుకున్న మచ్చ రవి అసలు పేరు బాచుమంచి వెంకట సుబ్రహ్మణ్యం రవి కాగా బివీఎస్ రవి, మచ్చ రవి గా ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయ్యారు. నిజానికి తాజాగా ఆహాలో వస్తున్న అన్ స్టాపబుల్ తో మరింత క్రేజ్ సంపాదించుకున్న రవి మొదట రైటర్ గా పోసాని గారి వద్ద పనిచేసి పోసాని రైటర్ గా చేసిన సినిమాలకు సహాయం చేసారు. అయోధ్య రామయ్య, భద్రాచలం, సీతా రామరాజు, సీతయ్య వంటి సినమాలకు పోసాని అసిస్టెంట్ గా పనిచేసారు రవి. బిటెక్ బళ్లారిలో చేస్తున్న సమయంలో కొరటాల శివ ఫ్రెండ్ అవడం, అలా కొరటాల శివ మేనమామ అయిన పోసాని వద్ద చేరాడు. ఇక గోపీచంద్ హీరోగా వచ్చిన ‘వాంటెడ్’ సినిమాతో డైరెక్టర్ అయిన రవి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడారు.

కొరటాల నాకు మంచి స్నేహితుడు…

బళ్లారిలో బిటెక్ చదివే సమయంలోనే కొరటాల ఫ్రెండ్ అంటూ చెప్పారు రవి. అలా స్నేహితులుగా ఉన్న సమయంలోనే కొరటాల గారి మేనమామ అయిన పోసాని వద్ద అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు రవి. అలా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన రవి సొంతంగా వాంటెడ్ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఆ సినిమా సమయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రచన వైపు వెళితే డైరెక్షన్ సరిగా చేయలేనని భావించి ఇతరులను అడిగినపుడు వాళ్ళు సరిగా స్పందించలేదట.

అయితే కొరటాల స్నేహితుడే అయినా తనని అడగలేదని అడుగుంటే చేసేవాడేమో కానీ అడగలేదని, మా స్నేహంలో ఒకరికి ఒకరు ఏం మేలు చేసుకున్నాం అన్నది చెప్పలేనిది కానీ ఖచ్చితంగా ఇద్దరం ఒకరి ఎదుగుదాలకు ఒకరు ప్రోత్సహిచుకున్నాం అంటూ చెప్పారు రవి. ఇక వాంటెడ్ సినిమాకు మొదట బలుపు అనే టైటిల్ పెట్టాలని అనుకుంటే గోపీచంద్ వద్దన్నాడు. బలుపు అంటే బూతులాగా అనిపిస్తుంది అంటూ వద్దనే సరికి వాంటెడ్ అని పెట్టాం అంటూ ఆ సినిమా విశేషాలను, తను ఎదుర్కొన్న స్ట్రగల్స్ తెలిపారు రవి.