Movie News

NTR: ఎన్టీఆర్ కోసం పవన్ కళ్యాణ్ చేసిన పనికి కృతజ్ఞతలు తెలుపుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!

NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంతోమంది పవన్ కళ్యాణ్ కి వీరాభిమానులుగా మారీ ఆయన కోసం ప్రాణాలర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా కేవలం సినిమాలలో హీరోగా మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా ఇతరులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మంచి మనసున్న మనిషిగా అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

అంతేకాకుండా రాజకీయాలలో కూడా రాణించటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో నష్టపోయిన పేద రైతుల కోసం తాను సంపాదించిన డబ్బుని దానం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా కేవలం సాధారణ ప్రేక్షకులే కాకుండా ఎంతో మంది సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ కి వీరాభిమానులు. ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన పనికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

అసలు విషయం ఏమిటంటే.. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ప్రస్తుతం ఎన్టీఆర్ థర్టీ అనే వర్కింగ్ తో షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాకి ‘ దేవర ‘ అనే టైటిల్ పెట్టాలని కొరటాల శివ భావించినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసిన నటిస్తున్న సినిమాకి కూడా దేవర అనే టైటిల్ పెట్టాలనుకున్నట్లు తెలుస్తోంది.

NTR: తారక్ సినిమాకి పవన్ సాయం..


ఈ క్రమంలో కొరటాల శివ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి పరిస్థితి మొత్తం వివరించి ఇలా టైటిల్ పెట్టాలనుకున్నట్లు చెప్పిన వెంటనే పవన్ కళ్యాణ్ కూడా అందుకు అంగీకరించి ఎన్టీఆర్ సినిమా కోసం దేవర అనే టైటిల్ ని ఇచ్చేసినట్లు తెలుస్తోంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాకి దేవర అనే టైటిల్ కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కోసం పవన్ కళ్యాణ్ ఇలా టైటిల్ ని త్యాగం చేయటంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago