Writer Kommanapalli Ganapathi rao : శివ సినిమా టైములో ఆర్జీవి పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కాదు.. నువ్వేం డైరెక్టర్ వి అన్నారు…: రైటర్ కొమ్మనపల్లి గణపతి రావు

Writer Kommanapalli Ganapathi rao : నవలా రచయితగా రాసింది కొన్ని నావలలే అయినా అవన్నీ ప్రేక్షకాధరణ పొందిన నవలలే. ఒకవైపు ఉద్యోగం చెసుకుంటూనే మరో వైపు సాహిత్య రంగంలో కృషి చేసారు. ఇక ఆయన హంసధ్వని అనే నవలను సీరియల్ రూపంలో పత్రికకు రాస్తున్న సమయంలో ఆయన రచనలు నచ్చి నిర్మాత కాట్రగడ్డ మురారి గారు ఆయనను సినిమా రంగానికి పరిచయం చేసారు. శోభన్ బాబు హీరో గా వచ్చిన అభిమన్యుడు సినిమాకు మొదటి సారి పనిచేసారు. దాసరి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు మంచి పేరు తెచ్చుకున్నారు. కుటుంబ కథా రచయితగా మంచి గుర్తింపు ఉన్న కొమ్మనపల్లి ఆయనకు నచ్చని పని చేయను అంటూ నిర్మొహమాటంగా చెప్పడం వల్ల ఇండస్ట్రీలో శత్రువులను కూడా పెంచుకున్నారట. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి రచయిత డైరెక్టర్ ను ఇండస్ట్రీకి అందించింది ఈయనే. ఇక శివ సమయానికి వర్మతో పరిచయం, శివ సినిమా తీసేప్పుడు తన స్ట్రగల్ ఇలా అన్ని విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు కొమ్మనపల్లి.

శివ కోసం ఆర్జీవి తిప్పలు మాములుగా పడలేదు…

కలెక్టర్ గారి అబ్బాయి సినిమాకు కథా రచయితగా ఉన్న కొమ్మనపల్లి గారు ఆ సమయంలోనే వర్మ ను అన్నపూర్ణ స్టూడియోస్ లో చూశారట. కొంద్ది రోజులు గమనించగా ఒక మూల్లో కూర్చొని ఉంటున్నాడు ఎవరా అబ్బాయి అనే ఆరా తీసి తనతో మాట్లాడగా తనకు ఇంగ్లీష్ నవలల మీద ఉన్న జ్ఞానం చూసి ఆశ్చర్యమేసిందంటూ తెలిపారు. ఇక తను శివ స్టోరీ మొదట నాగేశ్వరావు అల్లుడు సురేంద్ర కు చెప్పగా ఇలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు వదిలేయండి అన్నారు. ఇక వర్మ ప్రయత్నించి నాగార్జున కు రెండు సీన్స్ చెప్పగానే నాగార్జున సినిమా తీస్తానని మాటిచ్చాడు. ఇక సినిమా మొదలు పెట్టినప్పటి నుండి వర్మ కష్టాలు అన్నీ ఇన్నీ కాదు.

హీరో ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది అంటూ నాగార్జున అన్న వెంకట్ అడగడం వర్మ చెప్పగానే నచ్చక నువ్వేం డైరెక్టర్ అన్నట్లుగా చూసారు. అసలు సినిమా ఎలా తెస్తాడో అనే భయం ఉండేది అందరికీ కానీ నాగార్జున వర్మను నమ్మాడు. ఇక తన రీ రికార్డింగ్ అపుడు ఇళయరాజాకు సీన్ కి మ్యూజిక్ ఎలా ఉండాలో వివరించిన తీరుకు ఇళయరాజా ఫిదా అయ్యాడు. మొదటి సారి రీ రికార్డింగ్ చేయనిస్తున్నాడు ఈ డైరెక్టర్ అంటూ చెప్పాడు. సినిమాలో నాగార్జున సైకిల్ చైన్ లాగే సీన్ కి చప్పట్లు మామూలుగా రాలేదు. ఇండియా లోనే టాప్ డైరెక్టర్ అయిపోతాడు వర్మ అని ఆరోజే అనిపించింది. తనకున్న నాలెడ్జ్ అమోఘం అంటూ చెప్పారు కొమ్మనపల్లి గణపతి రావు.