Jabardasth: బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కామెడీ షోలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం ఎంతోమందికి జీవితాన్ని అందించిందని చెప్పాలి. ఇలా ఈ కార్యక్రమాల ద్వారా పలువురికి అవకాశాలు కల్పించి నేడు ఇండస్ట్రీలో వారికి స్టార్ సెలబ్రిటీ హోదాని అందించింది.ఇలా ఎంతోమందికి జీవితాన్ని అందించిన జబర్దస్త్ కార్యక్రమం తాజాగా మరొకరికి అవకాశం కల్పించింది.
తెలుగు తమిళ భాషలలో సుమారు 250కి పైగా సినిమాలలో నటించి లేడీ కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి వాసుకి గురించి అందరికీ సుపరిచితమే. వాసుకి అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ నటి పాకీజా అంటే మాత్రం అందరికీ టక్కున ఈమె గుర్తుకు వస్తారు.ఇలా ఒకానొక సమయంలో వందల సినిమాలలో నటించిన ఈమెకు ప్రస్తుతం అవకాశాలు లేక ఉన్న ఆస్తిని కోల్పోయి కటిక దారిద్రాన్ని అనుభవిస్తున్నారు.
ఉండటానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక సతమతమవుతున్న ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా తన కన్నీటి కష్టాల గురించి తెలియజేయడంతో పలువురు సెలబ్రిటీలు ఈమెను ఆదుకున్నారు. అయితే ఈమె కష్టాలను చూసిన జబర్దస్త్ యాజమాన్యం తనకు జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా నటి పాకీజా సందడి చేశారు.
తనకు పాకీజా గెటప్ ఎంతో మంచి పేరును తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలోకి ఈమె పాకీజా గెటప్ లోనే ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఈమె రైజింగ్ రాజు టీమ్ లో సందడి చేయబోతున్నారు.ఈ కార్యక్రమంలో ఈమెకు అవకాశం రావడంతో ఇక నటి పాకీజా కష్టాలు తీరిపోయినట్లేనని పలువురు భావిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో వచ్చిన అవకాశాన్ని ఈమె ఎలా ఉపయోగించుకుంటారో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…