Y. Vijaya : నా 100 కోట్ల ఆస్తి.. కానీ ఆ ఐదుగురి ఫోన్ వస్తే గుండె దడ దడలాడేది… జీవితంలో ఆ రోజుని మర్చిపోను.. : నటి వై విజయ

Y. Vijaya : డాన్స్ నేర్చుకోడానికి చెన్నై వెళ్లి వెంపటి చిన్న సత్యం గారి కంట పడి హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్న సీనియర్ నటి వై విజయది కర్నూల్ అయినా కడపలో పెరిగింది. ఇక దాదాపు 1000 సినిమాల్లో నటించిన విజయ మొదట్లో హీరోయిన్ పాత్ర చేసినా ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది. పులుసు పాత్ర బాగా పేరు తెచ్చిపెట్టగా ఆ ఒక్క పాత్రతో దాదాపు వంద సినిమాలను చేసిందట విజయ. ఇక తాజాగా f3 సినిమాలో కూడా అలరించింది విజయ.

ఆ ఐదు మంది ఫోన్లు వస్తే గుండె దడ పెరిగేది…

పులుసు పాత్రతో బాగా పేరు తెచ్చుకున్న విజయ ఆ తరువాత అలాంటి పాత్రలే ఎక్కువగా చేసింది. ఇక అప్పట్లో ఫుల్ బిజీగా ఉండే ఆర్టిస్టుల్లో విజయ ఒక్కరు. అలాంటి సమయంలోనే ఒకే రోజు ఐదు షూటింగులు ఉండటంతో చాలా టెన్షన్ పడ్డారట. ఆ ఐదు ప్రొడక్షన్స్ నుండి ఫోన్ వస్తే తీయాలంటేనే భయమేసింది అంటూ చెప్పారు. పెద్ద ప్రొడక్షన్ సినిమాలే అన్నీ కావడం, అన్నీ ఒకే రోజే ఉండటం వల్ల ఇబ్బంది పడ్డారట. మొదట ఆ డేట్ ను ఇచ్చింది తేనెమనసులు సినిమాకు కావడంతో ఆ సినిమా షూటింగ్ కి వెళ్ళారట.

బెంగళూరులో కృష్ణ, జయప్రదల సినిమా షూటింగ్ అయ్యాక ఫ్లైట్ మిస్ అవ్వడంతో లేట్ అయింది. ఉదయానికి రవి రాజా పినిశెట్టి గారి దర్శకత్వంలో జరుగుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉన్నా ఆలస్యం అవడంతో బాగా టెన్షన్ పడ్డాను అంటూ చెప్పారు. ఇక లేటుగా పొద్దున్న కాల్షీట్ ఉన్న షూటింగ్ కి మధ్యాహ్నం వెళ్లడంతో ఏమంటారో అన్న భయంతో కారులో ఉండిపోయానని రవి రాజా పినిశెట్టి తో మొదటి సినిమా కావడంతో టెన్షన్ పడ్డానని చెప్పారు. అయితే రవి రాజా గారు ఈరోజు విశ్రాంతి తీసుకొని రేపు షూటింగ్ కి రమ్మని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారట విజయ. ఇక అలా ఒకే రోజు ఐదు షూటింగులు ఉంటే ఒక్క షూటింగ్ కి వెళ్లలేక పోయారట.

ఇక అంత బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నా ఏనాడూ రెమ్యూనరేషన్ విషయంలో డిమాండ్ చేయలేదని, నెమ్మదిగా పైకి రావాలి కానీ వేగంగా ఎదిగి కిందకి పడిపోకూడదని తన భర్త చెప్పేవారట. ఇక సినిమా ఆదాయం ఎక్కువ రోజులు ఉంటుందో ఉండదో తెలియదు కాబట్టి ఇతర మార్గాల్లో ఆదాయం వచ్చేలా చేసుకోవాలని అలోచించి షాపింగ్ కాంప్లెక్స్, కళ్యాణ మండపం కట్టించామని చెప్పారు.