Yash leaked about KGF 3 : అప్పుడే కేజిఎఫ్ 3 పై హీట్ పెంచుతున్న యష్…సినిమా గురించి లీకులు…!

Yash leaked how KGF 3 going to be : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటించిన కే జి ఎఫ్ 2 సినిమా భారీ అంచనాలతో వచ్చినా ఆ అంచనాలను మించి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ మాత్రం తగ్గకుండా రికార్డులను తిరగరాస్తోంది. బాలీవుడ్ లో హిందీ సినిమాలను సైతం పక్కకునెట్టి ఈ సినిమా ముందుకెళుతోంది అంటే కేజీఫ్ మానియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అటు నార్త్ నుంచి ఇటు సౌత్ వరకు కేజిఎఫ్ ప్రభంజనం కనిపిస్తోంది.

ఒకప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమ అంటే పెద్దగా పట్టించుకునేవారు లేరు, కానీ కేజీఎఫ్ సినిమా తో ఆ లెక్కల మారిపోయాయి. కేజిఎఫ్ 1 శాండిల్ వుడ్ లో విజయం సాధిస్తే, దానికి సీక్వెల్ గా వచ్చిన కే జి ఎఫ్ 2 ప్రపంచాన్ని కన్నడ చలనచిత్ర పరిశ్రమ వైపు చూసేలా చేసింది. కన్నడ చలనచిత్ర పరిశ్రమకు ఇంతటి గౌరవాన్ని తెచ్చిపెట్టిన కేజిఎఫ్ 2 సినిమా ఘన విజయం వెనుక మాత్రం ముఖ్యంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హీరో యష్ పాత్ర ఉందనడంలో అతిశయోక్తి లేదు. అయితే చిత్రబృందం చాప్టర్2 ఎండింగ్ లో కే జి ఎఫ్ చాప్టర్ 3 రాబోతోంది అన్న హింట్ ఇచ్చారు. దీని గురించి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో ఆసక్తికర విషయాలు తెలియజేశారు.

కేజిఎఫ్ 3 ఎలా ఉంటుందో చెప్తున్న యష్…..

కేజిఎఫ్ 2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న యష్, తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దాంట్లో కేజిఎఫ్ 3 గురించి కొన్ని లీక్ లు ఇచ్చారు. యాక్షన్ సన్నివేశాలు అంటే కేజిఎఫ్ 1, కేజీఫ్ 2 సినిమాలే ప్రస్తుతం గుర్తుకు వస్తాయి. అయితే కేజిఎఫ్ చాప్టర్ 3లో ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా యాక్షన్ సన్నివేశాలను చూపించబోతున్నాడు చెప్పారు. ఈ సన్నివేశాలు ఎలా ఉండాలి అన్న విషయంపై తాను ఇంకా ప్రశాంత్ నీల్ అపుడే చర్చించుకున్నట్లు కూడా చెప్పారు. యష్ చెప్పిన ఈ మాటలతో అభిమానులలో కేజిఎఫ్ 3 సినిమా ఇంకెలా ఉండబోతోందో అన్న అంచనాలు పెరుగుతున్నాయి.

KGF2 : కేజిఎఫ్ కోసం యశ్, ప్రశాంత్ నీల్, రవీనా తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

అంతేకాకుండా ఇన్ని రోజులు కన్నడ చిత్ర పరిశ్రమను మన దేశంలోని ఇతర పరిశ్రమల్లో తక్కువ చేసి చూడటం చాలా బాధగా అనిపించేది అని, కానీ ఇప్పుడు తాను హీరోగా నటించిన కే జి ఎఫ్ 2 సినిమా శాండిల్ వుడ్ గౌరవాన్ని పెంచడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని చెప్పారు. భారతీయ సినిమాలు ప్రపంచ స్థాయికి వెళ్లడం మీద అభిప్రాయం అడిగినప్పుడు… టాలీవుడ్ లో టెక్నాలజీని ఎక్కువగా వాడుతుంటారు అందుకు తగ్గట్టుగా బడ్జెట్ కూడా ఉంటుంది కానీ మన సినిమాలలో టెక్నాలజీ కంటే కంటెంట్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు కాబట్టే ప్రపంచ వ్యాప్తంగా మన సినిమాలను చూస్తున్నారు అని చెప్పారు.