Acharya: దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఎట్టకేలకు రేపు (ఏప్రిల్ 29) ఉదయం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే చిత్రబృందం పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచారు.
ఇకపోతే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించడంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే థియేటర్ల దగ్గర మెగా అభిమానుల సందడి నెలకొంది.ఈ విధంగా తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి నటించడం ఈ సినిమాని చూడటం కోసం మరి కొన్ని గంటలు మాత్రమే వేచి ఉండాలి.
ఇక ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కావడంతో పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఇక ప్రాంతాల వారిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగిందంటే.. నైజాం 38 కోట్లు, సీడెడ్ 18.50, ఉత్తరాంధ్ర 13, ఈస్ట్ 9.5 కోట్లు, వెస్ట్7.20, గుంటూరు 9 కోట్లు, కృష్ణ 8 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాలు 107.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. మొత్తం వరల్డ్ వైడ్ ఆచార్య సినిమా 131.20 కోట్ల బిజినెస్ జరుపుతున్నట్లు సమాచారం.
ఈ విధంగా వరల్డ్ వైడ్ 131.20కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 132.50 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.ఇకపోతే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా నటించడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.ఇలా ఒక వైపు సినిమా హిట్టవుతుందనే నమ్మకం మెగా అభిమానులలో ఉన్నప్పటికీ మరోవైపు రాజమౌళి సెంటిమెంట్ మెగా అభిమానులకు కొంత ఆందోళన కలిగిస్తుంది. మరి రామ్ చరణ్ ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…