Is Anushka apear in Acharya movie : సూపర్ సినిమా తో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమైన అనుష్క, ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలిగారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు అనుష్క. అయితే నిశ్శబ్దం సినిమా తర్వాత దాదాపు మూడేళ్ల అవుతున్నా అనుష్క సినిమాల వైపు చూడటం లేదు. చాలా గ్యాప్ తర్వాత నవీన్ పోలిశెట్టి తో ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్నారు. అయితే తాజాగా అనుష్క ఆచార్య సినిమాలో కనిపించబోతున్నారు అని రూమర్స్ వస్తున్నాయి.
ఆచార్య సినిమాలో కనిపించబోతున్న అనుష్క….
ఆర్ఆర్ఆర్ సినిమా ఘన విజయం తర్వాత రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి తో కలిసి తీసిన సినిమా ఆచార్య. మెగాస్టార్ ఇంకా రామ్ చరణ్ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్ కు జోడిగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన మొదట కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది అనే వార్తలు వినిపించినా తర్వాత కాజల్ సినిమా నుంచి తొలగించడం జరిగింది అని దర్శకుడు కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు.
అయితే ప్రస్తుతం సినిమాలో ఒక్క సీన్ కోసం అనుష్క ను తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా నుంచి కాజల్ ని తొలగించడం కారణంగా సినిమాకు గ్లామర్ టచ్ కోసం అనుష్కను ఒక్క సీన్ కోసం సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వడానికి చిత్రం బృందం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతోంది అని భోగట్టా. అయితే ఈ సినిమాలో అనుష్క ఒక స్పెషల్ సాంగ్ లో కానీ ఒక సీన్లో కానీ మెరవనున్నట్లు చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చాలా ఏళ్ళ తర్వాత అనుష్కను స్క్రీన్ మీద చూడలేని అభిమానులకు నిజంగా ఇది సర్ ప్రైజ్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…