Featured

Allu Arjun: వామ్మో… పుష్ప 2 కోసం కళ్లుచెదిరే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన బన్నీ… ఎంతో తెలుసా?

Allu Arjun:క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన సినిమా పుష్ప. ఈ సినిమా గత ఏడాది విడుదలయ్యే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ ఎవరూ ఊహించలేదు.

ఈ విధంగా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా పుష్ప 2 రానున్న సంగతి మనకు తెలిసిందే. అయితే పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ సినిమాకు మించి పుష్ప పార్ట్-2 ఉండేలా దర్శకుడు స్క్రిప్ట్ కు మరిన్ని మెరుగులు దిద్దుతున్నారు.ఇక ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో పార్ట్ 2 కోసం మరింత బడ్జెట్ కేటాయించనున్నారు.

ఈ క్రమంలోనే హీరో అల్లు అర్జున్ కూడా తన రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం డైరెక్టర్ సుకుమార్ ,హీరోయిన్ రష్మిక భారీగానే రెమ్యూనరేషన్ పెంచేశారు.తాజాగా అల్లు అర్జున్ సైతం ఈ సినిమా కోసం ఏకంగా వంద కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

భారీగా పెరిగిన అంచనాలు..


ఈ విధంగా అల్లు అర్జున్ 100 కోట్లు డిమాండ్ చేశారని తెలియడంతో ఎంతో మంది ఆశ్చర్యపోతున్నారు.ఒక అల్లు అర్జున్ కోసమే ఈ రేంజ్ లో బడ్జెట్ కేటాయిస్తే ఇక సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టాలి అంటూ ఆరా తీస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం సుకుమార్ 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోనున్నారు. కేవలం వీరిద్దరి కోసమే మైత్రి మూవీ మేకర్స్ 150 కోట్ల రూపాయలను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పుష్ప మంచి విజయాన్ని అందుకోవడంతో పుష్ప పార్ట్ 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక త్వరలోనే ఈ సినిమా స్క్రిప్ట్ పనులను పూర్తిచేసుకుని సెట్స్ పైకి వెళ్లనుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago